15 రోజుల్లోగా రుజువు చేసుకోండి!
⇒ రోహిత్ కులంపై కుటుంబానికి గుంటూరు కలెక్టర్ నోటీసులు
⇒ న్యాయపోరాటం చేస్తున్న రోహిత్ తల్లి రాధిక
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కులంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని కుటుంబసభ్యులకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం నోటీ సులు జారీ చేశారు. 15 రోజుల్లోగా తమ కులా న్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలను ఆదేశించారు. లేదంటే వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేస్తామన్నారు.
వివక్ష, అణచివేతకు నిదర్శనం...
ఈ నోటీస్‌పై రాధిక, రాజా మండిపడ్డారు. దళిత వాడలో పుట్టి పెరి గిన తమను కులం నిరూ పించుకోవాలంటూ హెచ్చరించడం ప్రభుత్వ వివక్ష, అణచివేత ధోరణికి నిదర్శనమ న్నారు. తమ వాదనలు వినకుండా, కనీసం తమ నివాసం చుట్టుపక్కల ఉన్నవారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తమ కులాన్ని మార్చే అధికారం కలెక్టర్‌కు ఎవరిచ్చారంటూ రాధిక ప్రశ్నించారు. తమ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మణికుమార్ (రాధిక భర్త), అతని తల్లి రాఘవమ్మల స్టేట్‌మెంట్ ఆధారంగా కులంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం దారుణమని పేర్కొ న్నారు. చంద్రబాబునాయుడు, బీజేపీతో కలసి సాగిస్తున్న దాడిగా దీన్ని ఆమె అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే...
ఇలా ఉండగా, రోహిత్ వేముల, అతని తల్లి రాధిక, సోదరుడు రాజా దళితులు కాదని చెప్పడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నా రని దళిత మేధావి, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. నోటీసులు జారీ చేయడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వక్రీకరించడమేనన్నారు. రోహిత్‌కు మద్దతుగా నిలబడి పోరాడిన వాళ్లపైన నైతి కంగా దాడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టను న్నట్లు దళిత స్త్రీశక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. రాధికకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు.