![Congress Senior Leader Anand Sharma Fires On BJP, Trs - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/29/ANAN.jpg.webp?itok=rU1aJI95)
ఆనంద్ శర్మ
సాక్షి,హైదరాబాద్: టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే గూటి పక్షులని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఉపనేత ఆనంద్ శర్మ అభివర్ణించారు. ఇరుపక్షాలు ఎన్నికల కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అవసరమై న ప్రతిసారీ టీఆర్‌ఎస్ అండగా నిలుస్తూ వచ్చిం దని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి ఉన్నాయని, భవిష్యత్తులోనూ కలిసి ఉంటాయని జోస్యం చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
నోట్లరద్దుకు మద్దతు ప్రకటించి వేడుకలు జరుపుకున్న కొద్దిమద్ది సీఎంలలో కేసీఆర్ ఒకరన్నారు. తెలంగాణలో ముస్లిం ఓట్లు కీలకంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. మోదీ దేశాన్ని లూటీ చేస్తుంంటే కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీæ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడున్న 5 సీట్లు కూడా బీజేపీకి రావని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సెమీఫైనల్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment