(చిన్నచింతకుంట)ఆత్మకూర్, న్యూస్‌లైన్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాల సం దర్భంగా నిర్వహించాల్సిన టెంకాయల విక్రయం, తలనీలాల టెండర్లు ము చ్చటగా మూడోసారి కూడా వాయిదాపడ్డాయి. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టెండర్లు కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య వైషమ్యాల కారణంగా వాయిదాపడినట్లు తెలిసింది. దీంతో ఈనెల 3వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో టెండర్లు వాయిదాపడటంతో ఆలయ ఆదాయానికి రూ.50లక్షలు నష్టం వాటిల్లనుంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే ఈ తంతుకొనసాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 18న ‘ఆన్‌లైన్’ ద్వారా రూ.18లక్షలకు జూరాల నర్సింహా టెంకాయల టెండర్లు దక్కించుకున్నారు.
అదేరోజు హైదరాబాద్‌లోని ఓ కంపెనీవారు రూ.30.50 లక్షలకు తలనీలాల టెండర్లు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల కారణంగా ఈనెల 28న హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో తిరిగి టెండర్లు నిర్వహించారు. గతంలో టెండర్లు పొందిన వ్యక్తులు అడ్డుకోవడటంతో ఆ టెండర్లను తిరిగి గురువారం మళ్లీ అదే కార్యాలయంలో నిర్వహించారు. గతంలో జరిపిన టెండర్లను ఎందుకు రద్దుచేశారో చెప్పాలంటూ టీసీసీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అక్కడ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది.
టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి వల్లే ఈ టెండర్లు వాయిదా పడ్డాయని టీసీపీఎం జిల్లా నాయకులు ఐ.శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. పాలకమండలి చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కావడంతోనే ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టెండర్లు వాయిదా పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీని ఫలంగా ఆలయానికి రావాల్సిన రూ.50లక్షల ఆదాయం చేజారిపోయిందని పెదవివిరిచారు. మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ టెంకాయల అమ్మకాలు ఎలా, ఎవరు నిర్వహిస్తారని భక్తుల్లో అయోమయం నెలకొంది. గురువారం జరిగిన టెండర్ల ప్రక్రియలో దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ, ఆలయ ఈఓ హేమంత్, పాలక మండలి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌జేసీ కృష్ణవేణి పాల్గొన్నట్లు తెలిసింది.
కురుమూర్తిరాయ.. ఇదేంటయ్యా!
Published Fri, Nov 1 2013 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement