mirat
-
ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి.. -
భార్యను వేధించొద్దన్నందుకు ఇనుప రాడ్‌తో దాడి
లక్నో: ప్రభుత్వాలు మహిళలు, యువతుల పట్ల వేధింపుల నిరోధానికి ఎన్ని కఠిన చట్టాలు చేసిన కొందరు యువకులలో మార్పు రావండం లేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్‌లోని లిసారి గేట్ ప్రాంతంలో బాధిత మహిళ, తన భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో లిసారి ప్రాంతానికి చెందిన యువకుడు సదరు వివాహితను ప్రతిరోజు అనుసరించేవాడు. అంతటితో ఆగకుండా తన ఫోన్ నంబర్ ఇవ్వాలని విసిగించేవాడు. మొదట ఆ వివాహిత యువకుడిని పట్టించుకునేది కాదు. అయితే, క్రమక్రమంగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో నిన్న (గురువారం) బాధిత యువతి తన ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. అదును కోసం ఎదురుచూస్తున్న యువకుడు ఆమెను వెంబడించాడు. అంతటితో ఆగకుండా ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందే అని అసభ్యపదజాలంతో దూశించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సదరు వివాహిత.. ఇంటికి వెళ్లి తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. కాగా, భర్తతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని గట్టిగా నిలదీశారు. అప్పటికే అతని ఇంట్లో మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే స్నేహితులతో కలిసి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో వివాహిత భర్తపై దాడిచేశాడు. అతను ఇంటి నుంచి బైటకు పరిగెత్తిన వెంబడించి మరీ గాయపర్చాడు. తీవ్రగాయాలపాలైన వివాహిత భర్త కిందపడిపోయాడు. కాగా, వివాహిత అరుపులు విన్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు వెంటనే బాధితుడిని మీరట్‌లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు నిందితులను గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.. -
ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయని .. మైనర్ కుమార్తెలను..
లక్నో: ఉత్తర ప్రదే్‌శ్‌లో విషాదం చోటు చేసుకుంది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రానన్నందుకు కోపంతో.. సదరు భర్త తన మైనర్ కుమార్తెలను అతిదారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్ జిల్లాలోని అనూప్ నగర్లో జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫజల్ పూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, జానీ భార్యభర్తలు. వీరికి ఆరేళ్లు, నాలుగెళ్లు ఉన్నఇద్దరు కుమార్తెలు. కాగా, ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భర్త, భార్య జానీని తరచు వేధించేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. గత వారంలో వీరు ఉంటున్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. దానిలో కొన్ని ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, ఖరీదైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కాస్త ఎక్కువయ్యాయి. దీంతో జానీ, తన పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అరుణ్ మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం (13 ఆగస్టు)న జానీ ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడు. అయితే, దీనికి భార్య నిరాకరించింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో, మద్యం మత్తులో ఉన్న అరుణ్.. విచక్షణ కోల్పోయి తన బిడ్డలను కత్తితో హత్యచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. -
తుపాకితో బెదిరించి వదినపై సాముహిక అత్యాచారం
లక్నో: ఒంటరిగా ఉన్న మహిళను తుపాకితో బెదిరించి మరిది తన స్నేహితుడితో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్ జిల్లాలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీనిపై బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ జిల్లాలో నివసిస్తున్న బాధిత మహిళ భర్త తాగుబోతు. కొంతకాలం కిందట భర్త ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన మరిది వరస అయ్యే సమీప బంధువు ఈ విషయం తెలుసుకున్నాడు. గురువారం రాత్రి బాధితురాలు ఒంటిరిగా ఉండటం గమనించి తనతో పోటు మరో యువకుడి వెంట తీసుకుని ఇంటి గోడ దూకి వెళ్లాడు. అది చూసిన బాధిత మహిళ భయంతో కేకలు వేయగా.. వారితో పాటు తెచ్చుకున్న తుపాకితో ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి తెగబడి కామవాంఛ తీర్చుకున్నారు. అనంతరం ఈ విషయం ఎవరికైన చెబితే చంపెస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరసటి(శుక్రవారం) సదరు మహిళ మీరట్ పోలీసు స్టేషన్లో తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి మరిది వరసయ్యే బంధువుతో పాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య!
లక్నో: తన భర్త తనను కాదని వేరే మహిళతో షాపింగ్‌కి వచ్చాడు. ఇది చూసిన ఆ వ్యక్తి భార్య ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే అతడిని తిడుతూ, పిడిగుద్దులతో దాడిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకొంది. అయితే వీరి గొడవ పెద్దదిగా మారడంతో షాప్‌యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ,పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వీరిద్దరికి ఇది వరకు వివాహంజరిగిందని తెలిపారు. దీనిలో బాధితురాలు అయేషా, తన భర్త అద్నాన్కు 2020లోనే వివాహం జరిగిందని చెప్పింది. వివాహం అయిన కొద్దిరోజులకే తనను పుట్టింట్లో వదిలేశాడని వాపోయింది. కాగా, విడాకులు ఇమ్మని బలవంతం చేశాడని చెప్పింది. అయితే, నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది. మాకు విడాకులు మంజురు కాలేదు.. కాబట్టి తన భర్త వేరే మహిళతో తిరగటాన్ని తప్పుబట్టింది. అయితే దీనిపై ఆమె భర్త.. అయేషా అంటే నాకు ఇష్టంలేదు. ఇప్పటికే విడాకులు ఇచ్చాను. నేను వేరే మహిళతో షాపింగ్‌చేస్తే అనవసరంగా రాధ్దాతం చేస్తొందని అన్నాడు. కాగా, దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్‌లోనే! -
40 లక్షల దొంగతనం: చివరికి..
లక్నో : ప్రజలందరూ దేవుడా ఓ మంచి దేవుడా ఓ బ్యాగ్ నిండా నోట్ల కట్టలతో నిద్ర లేచేసరికి ప్రత్యక్షం అయ్యేట్లు కరుణించూ అంటూ ఏదో ఒక సమయంలో కోరుకునే ఉండి ఉంటారు.. అది నిజంగా జరిగితే ఎగిరి గంతేసి సంతోషంగా దాచిపెట్టుకుని, ఉక్కిరిబిక్కిరి అవుతూ నోట్లకట్టలను ఒకటికి రెండు సార్లు లెక్కగట్టుతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ చెందిన ఒక వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. (చదవండి: మహిళ కొంపముంచిన సెకండ్ హ్యాండ్ ఫోన్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని మిషన్ కాంపౌండ్‌కి చెందిన ఒక వ్యక్తి బుధవారం నిద్రలేచేసరికి తన ఇంటి పైకప్పు పై రెండు బ్యాగుల కరెన్సీ నోట్లు కనపడటంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతకుముందు రోజు తమ ఇంటి పక్కన ఉన్న వ్యాపారవేత్త ఇంట్లో 40 లక్షల దొంగతనం జరగటంతో, అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే నేపాలీ రాజు ఈ దొంగతనానికి పాల్పడినట్లు, ఇందులో సెక్యురిటీగార్డు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన నేపాలీ రాజును అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు సెక్యురిటీ గార్డు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ) -
ఐజీకే షాకిచ్చిన ఆరేళ్ల పాప
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మాన్వి అనే ఆరేళ్ల పాప పోలీసు అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. తన తాత శాంతి స్వరూప్ వెంట పోలీసు ఉన్నతాధికారి ఇన్స్పెక్టర్ జనరల్ రామ్‌కుమార్ కార్యాలయానికి నేరుగా వెళ్లి తన అమ్మ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాల్సిందిగా కోరుతూ అందుకు లంచంగా తన కిడ్డీ బ్యాంకులోని డబ్బులు తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో ఐజీ కార్యాలయంలోని అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. రామ్‌కుమార్ మాన్వి తాత (తల్లికి తండ్రి) శాంతి స్వరూప్‌ను పిలిచి ఏమిటి విషయమని వాకబు చేశారు. ఆయన కథనం ప్రకారం మాన్వి తల్లి సీమా కౌషిక్‌కు ఏడేళ్ల క్రితం సంజీవ్ కుమార్ అనే యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లయిన నెల నుంచి మరింత కట్నం కావాలంటూ సంజీవ్, ఆయన ఇద్దరు సోదరులు, వారి తల్లి సీమను వేధించసాగారు. మూడేళ్లపాటు అష్టకష్టాలు అనుభవిస్తూ కాపురం నెట్టుకొచ్చిన సీమ, ఇక భరించలేక నాలుగేళ్ల క్రితం పుట్టింటికి పాపతో తిరిగొచ్చింది. అయినా అత్తింటి ఆరళ్లు ఆగలేదు. విలువైన నగలు, వస్తువులు ఎత్తుకొని పుట్టింటికి పారిపోయిందని, అత్తపై హత్యాయత్నానికి పాల్పడిందంటూ రెండు తప్పుడు కేసులు బనాయించారు. ఆ కేసులను కోర్టులు కొట్టివేశాయి. అయినప్పటికీ భర్త, అత్తింటి వేధింపులు ఆగకపోవడంతో సీమ గత ఏప్రిల్ నెలలో ఆత్మహత్య చేసుకొంది. అత్తింటి వేధింపులే కారణమంటూ ఆమె తండ్రి శాంతి స్వరూప్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు. భర్తతోపాటు ఆయన ఇద్దరు సోదరులు, తల్లిని నిందితులుగా చేర్చారు. భర్త సంజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇతర నిందితులను అరెస్ట్ చేయలేదు. కేసు దర్యాప్తు కొనసాగించడం లేదు. ఇదే విషయమై శాంతి స్వరూప్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి దర్యాప్తు అధికారిని కలసుకున్నారు. ‘ఇక్కడ డబ్బులు లేకుండా ఎవరూ పనిచేయరు. వెళ్లి 50 వేల రూపాయలను తీసుకరా, అప్పుడే నిందితులపై చర్య తీసుకుంటాను’ అని సదరు దర్యాప్తు అధికారి స్వరూప్‌ను వెనక్కి పంపించారు. ఇంటికొచ్చిన స్వరూప్ జరిగిన విషయాన్ని కొడుకు రోహిత్, ఇతర కుటుంబ సభ్యులకు వివరించారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామని, కేసును మరచిపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ఆ మాటలువిన్న మాన్వి తన కిడ్డీ బ్యాంక్‌ను తీసుకొచ్చి అందులోని మొత్తం డబ్బును తీసుకెళ్లి పోలీసులకు ఇమ్మని చెప్పిందట. ఈ విషయాన్ని రోహిత్ మీడియా ముందు చెప్పారు. ఆ మాటలు వినడంతో తనకు ఓ ఆలోచన వచ్చిందని, ఆ డబ్బులను ఐజీ తాతకు ఇద్దాంపదంటూ తండ్రి, మాన్వితో కలసి ఐజీ ఆఫీసుకు వచ్చామని రోహిత్ తెలిపారు. తమ మాటలకు స్పందించిన ఐజీ రామ్‌కుమార్ కేసు విచారణకు తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసు అధికారిని కూడా తప్పిస్తామని హామీ ఇచ్చారట.