Nurse Dance Performance For Bullet Bandi Song Memo Sent By District Medical Officer - Sakshi
Sakshi News home page

Bullet Bandi Song: హుషారుగా డ్యాన్స్‌.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్‌ వీడియో

Published Sat, Aug 21 2021 5:00 PM | Last Updated on Sat, Aug 21 2021 7:04 PM

Nurses Dance On Bullet Bandi Song Memo Sent By District Medical Officer - Sakshi

కరీంనగర్‌: ఇది సోషల్‌ మీడియా కాలం. ఓ చిన్న విషయాన్ని షేర్‌ చేస్తే.. అది జనాలకు నచ్చితే.. ఇట్టే వైరల్‌గా మారిపోతోంది. ఆ ట్రెండ్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు. అయితే డ్యూటీలో ఉండగా ఓ నర్సు చేసిన ‘‘బుల్లెట్టు బండి’’ డ్యాన్స్‌ బెడిసి కొట్టింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్‌పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సు జ్యోతి ‘‘బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు డ్యాన్స్‌ చేసింది. అయితే ఇండిపెండెన్స్‌ డే రోజున.. విధుల్లో ఉండగా డ్యాన్స్‌ చేయడంతో జ్యోతికి జిల్లా వైద్యాధికారి మెమో జారీ చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంతోషంగా మాత్రమే డ్యాన్స్‌ చేసినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఆగస్టు 15న తీసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చదవండి: గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్‌: నవ్వులే నవ్వులు!

అయితే జ్యోతికి మెమో జారీ చేయడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘కొన్ని రోజుల క్రితం డాక్టర్లు, నర్సులు చేసిన డ్యాన్స్‌లకు జనాలు చప్పట్లు కొట్టి, ప్రశంసలు కురిపించారు. అప్పుడు ఎంత మందికి మెమోలు జారీ చేశారు. ఆ సమయంలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు?’’ అంటూ ఘాటుగా స్పందించాడు.

కాగా ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే ఓ జానపద పాటకు వధువు తన బరాత్‌లో సూపర్‌గా డ్యాన్స్‌ చేసి వరుడిని బంధుమిత్రులతో పాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

చదవండి: Bullet Bandi Song: వధువు సూపర్‌ డ్యాన్స్‌.. చూస్తూ ఉండిపోయిన భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement