flok songs
-
‘స్వర కోకిల’ శారదా సిన్హా కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఆమెను బీహార్‌కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. బుధవారం పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇటీవలే శారదా సిన్హాకు బోన్ మ్యారో క్యాన్సర్ సోకింది. నాటి నుంచి ఆమె ఎయిమ్స్‌లోని ఆంకాలజీ మెడికల్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ ఒకటిన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.శారదా సిన్హా మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ఇలా రాశారు ‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతితో నేను చాలా బాధపడ్డాను. ఆమె పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద పాటలు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW— Narendra Modi (@narendramodi) November 5, 2024ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
రాజన్న సిరిసిల్లలో బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన నర్స్
-
హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో
కరీంనగర్: ఇది సోషల్ మీడియా కాలం. ఓ చిన్న విషయాన్ని షేర్ చేస్తే.. అది జనాలకు నచ్చితే.. ఇట్టే వైరల్‌గా మారిపోతోంది. ఆ ట్రెండ్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు. అయితే డ్యూటీలో ఉండగా ఓ నర్సు చేసిన ‘‘బుల్లెట్టు బండి’’ డ్యాన్స్ బెడిసి కొట్టింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ నర్సు జ్యోతి ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఇండిపెండెన్స్ డే రోజున.. విధుల్లో ఉండగా డ్యాన్స్ చేయడంతో జ్యోతికి జిల్లా వైద్యాధికారి మెమో జారీ చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంతోషంగా మాత్రమే డ్యాన్స్ చేసినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఆగస్టు 15న తీసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్: నవ్వులే నవ్వులు! అయితే జ్యోతికి మెమో జారీ చేయడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘కొన్ని రోజుల క్రితం డాక్టర్లు, నర్సులు చేసిన డ్యాన్స్‌లకు జనాలు చప్పట్లు కొట్టి, ప్రశంసలు కురిపించారు. అప్పుడు ఎంత మందికి మెమోలు జారీ చేశారు. ఆ సమయంలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు?’’ అంటూ ఘాటుగా స్పందించాడు. కాగా ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే ఓ జానపద పాటకు వధువు తన బరాత్‌లో సూపర్‌గా డ్యాన్స్ చేసి వరుడిని బంధుమిత్రులతో పాటు.. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. చదవండి: Bullet Bandi Song: వధువు సూపర్ డ్యాన్స్.. చూస్తూ ఉండిపోయిన భర్త