న్యూఢిల్లీ: ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఆమెను బీహార్‌కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. బుధవారం పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇటీవలే శారదా సిన్హాకు బోన్ మ్యారో క్యాన్సర్ సోకింది. నాటి నుంచి ఆమె ఎయిమ్స్‌లోని ఆంకాలజీ మెడికల్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ ఒకటిన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.
శారదా సిన్హా మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ఇలా రాశారు ‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతితో నేను చాలా బాధపడ్డాను. ఆమె పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద పాటలు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు.
सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW
— Narendra Modi (@narendramodi) November 5, 2024
ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment