sarada
-
#Shyam Benegal శారదకు దక్కని అంకుర్.. షబానాను వరించింది!
ఓల్డ్ అల్వాల్ పోరడు– బి. నరసింగ రావు, దర్శకులుశ్యామ్ బెనగళ్ (Shyam Benegal) కూ నాకూ 12 ఏళ్ల వయసు తేడా ఉంది. ఆయనకు 90 అయితే నాకు 78. మా ఓల్డ్ అల్వాల్‌లో వాళ్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. గతంలో శ్యామ్ అన్నయ్య మధు అందులో ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కనిపించడం లేదు. శ్యామ్ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ల నాన్నకు ఫొటో స్టుడియో ఉండేది. అందులో మేము చిన్నప్పుడు ఫొటోలు దిగేవారం. శ్యామ్ చాలా యాక్టివ్. నిజాం కాలేజీలో (Nizam College) మేగజీన్ ఎడిటర్‌గా ఉండేవాడు. ఫిల్మ్ సొసైటీ నడిపాడు. సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయ్యి వెంటనే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకునేవాడు ఆటలకు. గురుదత్ ఆయనకు కజిన్. బాంబే వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలంటే చార్జీలకు కూడా డబ్బులు లేవు. అప్పుడు మా మిత్రుల్లో అమ్రేష్ అనే అతని అన్న రైల్వేలో ఉండేవాడు. అతను పాస్ ఇస్తే వెళ్లాడు. గురుదత్ ఇంట్లోనే ఉండి సినిమాలు తెలుసుకున్నాడు. ‘అంకుర్’ (Ankur) కథలో హీరోకు మా మిత్రబృందంలోని ఒక వ్యక్తి జీవితమే ఇన్స్పిరేషన్. ‘నీ కథే తీస్తున్నానురా’ అని ఆ మిత్రుడికి చెప్పి మరీ ఆ సినిమా తీశాడు. ఆఫ్కోర్స్... సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడు. తన నిర్మాణ సంస్థకు ‘సహ్యాద్రి ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం శంకరమంచి కథలను దూరదర్శన్ కోసం తీస్తున్నప్పుడు నన్ను కలిశాడు. వాటి నిర్మాణంలో నా మాటసాయం ఉంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆఖరుసారి మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడలేదు. చాలా క్వాలిటీతో ఎక్కువ పని చేసిన దర్శకుడు శ్యామ్. శారదకు మిస్సయిన ‘అంకుర్’ శ్యామ్ బెనగళ్ తన మొదటి సినిమా ‘అంకుర్’లో హీరోయిన్గా వహీదా రెహమాన్‌ను (Waheeda Rehman) అనుకున్నాడు. ఆమె మొదట చేస్తానని తర్వాత నో చెప్పింది. అప్పుడు శారదకు ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుందని ఆమెను సంప్రదించాడు. ఆమెకు కథ నచ్చినా, దక్కనీ భాషలో డైలాగులు చెప్పగలనో లేదో అనే సందేహంతో చేయలేదు. అపర్ణసేన్ కూడా వెనుకా ముందు ఆడటంతో చివరకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన షబానా ఆజ్మీని ఎంచుకున్నాడు. షబానాకు ఒకరకంగా హైదరాబాద్‌తో బంధం ఉన్నట్టే కదా. ఆమె తల్లి షౌకత్ హైదరాబాదీ. షబానా, స్మిత, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి... వీరంతా బెనగళ్ సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించారు.సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్యామ్ బెనగళ్ నివాసం ప్రస్తుత స్థితి -
‘స్వర కోకిల’ శారదా సిన్హా కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఆమెను బీహార్‌కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. బుధవారం పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇటీవలే శారదా సిన్హాకు బోన్ మ్యారో క్యాన్సర్ సోకింది. నాటి నుంచి ఆమె ఎయిమ్స్‌లోని ఆంకాలజీ మెడికల్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ ఒకటిన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.శారదా సిన్హా మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ఇలా రాశారు ‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతితో నేను చాలా బాధపడ్డాను. ఆమె పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద పాటలు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW— Narendra Modi (@narendramodi) November 5, 2024ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో సీఎం జగన్
-
శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
-
విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు
-
విశాఖ శారద పీఠానికి సీఎం వైఎస్ జగన్
-
శారదకు టిటా సాయం
-
సాఫ్ట్వేర్ శారద..అందరికీ స్ఫూర్తి
-
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్ రామంతాపూర్‌లో గుండెపోటుతో మృతిచెందారు. మజ్జి శారద ఆదినుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పలాస నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి చవిచూశారు. దివంగత పీసీసీ అధ్యక్షుడు మజ్జి తులసిదాస్ పెద్ద కుమార్తె మజ్జి శారద. తండ్రి మరణాంతరము 1994లో గ్రూప్ వన్ అధికారి ఉద్యోగాన్ని విడిచి తండ్రి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కోటా కింద పదవిని దక్కించుకున్న మజ్జి శారద నాలుగేళ్లకే పరిమితమయ్యారు. ఈమె పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందించారు. -
ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని తూర్పు అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యు డు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేయడంతో కలకలం రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు ఓ ప్రజాప్రతినిధిని చంపడం ఇదే తొలిసారి. పోలీసులు ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కూంబింగ్‌లు జరుపుతూ మావోయిస్టుల కార్యకలాపాలు నివారించగలిగారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలతో మావోయిస్టులు కలకలం సృష్టించారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ సెంట్రల్ కమిటీ.. తెలంగాణలో కార్యకలాపాలను హరిభూషణ్‌కు అప్పగిం చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీ, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధిలో కొత్త కమిటీలు కూడా వేశారు. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ ఉండ గా, కొత్తగా వెంకటాపురం–వాజేడు కమి టీని నియమించారు. జూన్ ఆఖరి వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత బడే చొక్కారా వులతోపాటు 20 మంది మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇంతలోనే మావో యిస్టులు శ్రీనివాసరావును హత్య చేశారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు ఎవరీ శారదక్క? శ్రీనివాసరావు మృతదేహం వద్ద పార్టీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గంగారం గ్రామానికి చెందిన శారద (40) హరిభూషణ్ భార్య. ఆమెను జజ్జరి సమ్మక్క అలియాస్ సారక్క, అలియాస్ శారదగా పిలుస్తారు. జూన్ ఆఖరిలో వారంలో హరిభూషణ్‌తోపాటు శారద కూడా తెలంగాణలోకి వచ్చిందన్న పోలీసుల అనుమానాలు తాజా ఘటనతో నిజమయ్యాయి. కోటేశ్వరరావు రాకతో పెరిగిన దూకుడు మావోయిస్టు పార్టీ బాధ్యతలను నంబాల కోటేశ్వరరావు తీసుకున్నప్పటి నుంచి దూకుడు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరస దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీమా మండవితోపాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. మే ఒకటో తేదీన గడ్చిరోలిలో పోలీసు కాన్వాయ్ మీద దాడి చేయడంతో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. -
కన్నీటి పర్యంతమైన దొంతు శారద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్ పర్సన్లుగా ఉన్న మహిళలకు కనీస గౌరవంతో పాటు పదవి ద్వారా సంక్రమించిన హక్కులను కూడా కాలరాసేలా విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పర్యవసనంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని ఇంటికే పరిమితం అనే చందంగా అధికార పార్టీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిణమాల క్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద బుధవారం కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా కు సిద్ధపడ్డారు. చివరకు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి ఫోన్‌చేసి బుజ్జగించటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలిలో అధికార పార్టీ మహిళలు మున్సిపల్ చైర్పర్సన్లుగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పార్టీలో మహిళా నేతల పరిస్థితి దయనీయం. పట్టణాలకు ప్రథమ మహిళలే అయినా పార్టీలోనూ, పాలనలోనూ చివరి మహిళలుగా మిగులుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సొంత జిల్లాలోనే పట్టణాల ప్రథమ మహిళలకు కనీస ప్రాధాన్యం లేకపోవటంతో పార్టీలో పరిస్థితికి నిదర్శనం. గతంలో కావలిలో పార్టీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య మధ్య ఇదే తరహలో అధిపత్య పోరు సాగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి కాగానే అలేఖ్యను పదవి నుంచి తప్పుకోవాలని బీద ఒత్తిడి తేవటం, ఒప్పందంలోని అంశాలను మీరు ఏమీ పాటించకుండా ఇప్పుడు రాజీనామా చేయమని కోరటం సరికాదని ఆమె సామాజిక వర్గ మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారటంతో ఆమెనే కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గూడూరు మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మున్సిపల్ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుని మున్సిపల్ చైర్పర్సన్ ప్రా«ధాన్యం తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణమాల క్రమంలో ముగ్గురు మున్సిపల్ చైర్పర్సన్లు మంత్రి నారాయణకు మొర పెట్టుకున్నా తమకు ఎమ్మెల్యేలే ముఖ్యమని మంత్రి సృష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా మున్సిపల్ చైర్‌పర్సన్స్ వరెస్స్ ఎమ్మెల్యేలుగా వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వెంకటగిరిలో ముసలం మొదలై తారా స్థాయికి చేరింది. బీసీ మహిళ కావటం వల్లే వేధింపులు గురువారం వెంకటగిరి పట్టణంలో జరిగే మినీ మహానాడు వంటి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లుపై తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై ఆమె మనస్థాపం చెందారు. దీంతో అమె తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమరనాథ్‌రెడ్డి నేరుగా ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు భరించామని, ఇక తన వల్ల కావడం లేదంటూ ఆమె మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటున్నానని అయినా తనను అడుగు అడుగునా అవమానిస్తున్నారంటూ వాపోయారు. తన మాట వినాల్సిన అవసరం లేదని అధికారులు, సిబ్బందికి చెబుతుంటే ఎలా చైర్‌పర్సన్‌గా కొనసాగాలో అర్థం కావడం లేదని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అండతో ఆయన ముందే తనపై దూషణలకు దిగుతున్నా వారిని వారించకపోవడం వారిని పరోక్షంగా ప్రోత్సహించడం కాదా అంటూ మంత్రితో ఆమె ఫోన్లో కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి అమరనాథ్‌రెడ్డి తనే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అమరులను కించపరిచిన ప్రధాని
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం శోచనీయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మోదీ అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే టీడీపీ, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాయని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్లకు జాతీయహోదా, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి పార్లమెంటులో అడిగే దిక్కులేకుండా పోయిందన్నారు. నిధులు తేవడంలో సీఎం విఫలం: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు మిగతాపార్టీలు కాంగ్రెస్‌తో కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌దే అధికారమన్నారు. ఆ భయంతోనే బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ అధికారంలోకి తెస్తారని దీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి క్షీణించింది: శారద సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీకి రుణా లిచ్చామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకునే నిర్ణయాలపై వనపర్తి సమావేశంలో కొన్ని ప్రకటనలు చేశామన్నారు. ఆసరా పెన్షన్ వచ్చే వారికి కూడా అభయ హస్తం వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే ఉద్యమిస్తామని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద హెచ్చరించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి యూపీఏ హయాంలోనే ప్రయత్నించామని, పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సాధ్యం కాలేదన్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ల కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు శారద వెల్లడించారు. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. -
దసరా సరదా
బాలాజీచెరువు (కాకినాడ) : వీఎస్లక్ష్మీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో విద్యార్థులు కోలాటం, ఆటపాటలు, రంగువల్లులతో అలరించారు. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా గుజరాతీ వేషధారణలో చేసిన దాండియానృత్యం హృద్యంగా సాగింది. ఈ వేడుకలను కళాశాల ఏజీఎం చిన్మయ్శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎన్.వి.వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎం.పద్మజ తదితరులు పర్యవేక్షించారు. -
ఆ స్థితికి సిగ్గు పడుతున్నా..
‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి ఊర్వశి శారద ఆవేదన ఊర్వశి శారద సినీ రంగంలో ఓ ట్రెండ్ సెట్టర్. దాదాపు 350కిపైగా సినిమాలు, 60ఏళ్ల సినీ ప్రస్థానం, విభిన్నమైన పాత్రలు. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా అవార్డు సొంతం చేసుకున్నారు. స్వతహాగా తెలుగునటి అయిన శారదను మలయాళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించిన శారద ఆర్షవికాస పరిషత్ సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. సాక్షి : సరస్వతి అయిన మీరు శారదగా ఎలా మారారు? శారద : సినిమా రంగంలో అప్పటికే ఇద్దరు సరస్వతులు ఉన్నారు. అందువల్ల శారదగా మారాల్సి వచ్చింది. సాక్షి : సీనియర్ నటిగా మీకు రావాల్సిన అవార్డులు రాలేదంటారు. నిజమేనా? శారద : ప్రేక్షకుల అభిమానాన్ని మించిన అవార్డు లేదు కదా.. సాక్షి : మీరు తెలుగువారైనా మీలోని ప్రతిభను గుర్తించినవారు మలయాళీలు కదా? శారద : మలయాళీలు స్నేహప్రియులు. వారు ఇప్పటికీ నన్ను అమ్మ, అక్క అనే పిలుస్తారు. సాక్షి : నేటి సినిమాలను చూస్తే మీకేమనిపిస్తుంది? శారద: చాలా సందర్భాల్లో సిగ్గుపడుతుంటాను. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు లేవు. హీరోకు పూర్తి డ్రస్సులు.. హీరోయిన్లకు పీలికలు. సాక్షి : నేటి సినిమాల్లో మెలోడీలకు స్థానం లేదన్న దానిపై మీ కామెంట్ శారద : నిజమే. నేటి సినీ సాహిత్యం చాలా సందర్భాల్లో గుర్తుకురావడమే లేదు. సాక్షి : శారద సినీనటి కాకుంటే ఏమయ్యేవారు? శారద : ప్రశ్నే లేదు. శారద సినిమాల కోసమే పుట్టింది. శారద ఊపిరి సినిమానే.. సాక్షి : మీరు గర్వపడే సందర్భం.. శారద : ఒకే సినిమా పలు భాషల్లో నటించినప్పుడు అన్ని భాషల్లోనూ ప్రధాన పాత్ర పోషించడం సాక్షి : ఎన్టీఆర్ అవార్డు గురించి చెప్పండి శారద : నా జీవితంలో మరిచిపోలేని సంఘటన ఎన్టీఆర్ అవార్డు అందుకోవడమే. ఎన్టీఆర్ మహానటుడు. ప్రతిభను గుర్తించడం ఆయన నైజం. సాక్షి : ఐదు భాషల్లో నటించిన మీకు ఏ భాష సౌకర్యంగా ఉంటుంది? శారద : భాషా భేదమేమీ లేదు. ఏ భాషలోనైనా ప్రతిభ ఆధారంగానే అవకాశం దక్కింది. సాక్షి : నటిగా మీరు పొందిన అనుభూతి? శారద : అభిమానులు నన్ను అన్ని సంద ర్భాల్లోనూ తోబుట్టువుగా భావించారు. ‘సాక్షి’ తొలినుంచి నన్ను అభిమానిస్తూనే ఉంది. టీమ్ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
సరదా సరదాగా!
లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, ప్రతి నిమిషం సరదాగా గడపాలనుకునే ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. మరి అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సరదా’. విష్ణు, సోనారిక జంటగా జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో సోమా విజయ్‌ప్రకాశ్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ప్రతి ఫ్రేములోనూ సరదా ఉంటుంది. ఆ సరదాను హైలైట్ చేస్తూ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో విష్ణు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘సోనారికతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనూప్ మ్యూజిక్, విజయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, నిర్మాణ నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాశ్. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటికి గాయాలు
నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద ప్రముఖ సినీనటి, ఉర్వశీ శారద ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శారద స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆమె మరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. వివరాలు ... హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో పాల్గొనేందుకు నటీ శారద శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ క్రమంలో నల్గొండ జిల్లా ఆకుపాముల గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారుకు గేదలు ఒక్కసారిగా అడ్డు వచ్చాయి. ఆ క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో శారద స్వల్పంగా గాయపడ్డారు.