సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే ఉద్యమిస్తామని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద హెచ్చరించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి యూపీఏ హయాంలోనే ప్రయత్నించామని, పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సాధ్యం కాలేదన్నారు.
కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ల కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు శారద వెల్లడించారు. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment