హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు.
భవానీనగర్ ఇన్‌స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్‌లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment