Petrol Tank
-
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. -
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: బెరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌ను టాటా సుమో ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. పెట్రోల్ ట్యాంక్ పేలడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. సుమోలో ప్రయాణిస్తున్న అయిదుగు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
-
ఎండలో బండి జాగ్రత్త
మద్నూర్(జుక్కల్): భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలుత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్టమధ్యాహ్నం వేళనయితే చెప్పాల్సిన అవసరమే లేదు. జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎండలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తే పెట్రోల్ భానుడి భగభగలకు హాంఫట్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందామా.. గరిష్ట ఉష్ణోగ్రతలు.. జిల్లాలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. సుమారు 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల బారినుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వాహనాల విషయంలోనూ శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే వాహనం మొరాయించడం తప్పదని అంటున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే.. మనకు తెలియకుండానే జేబులకు చిల్లులు ఖాయం. ముఖ్యంగా జిల్లాలోని పలు కార్యాలయాల వద్ద పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో ఎండలోనే వాహనాలు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి. అలాగే వ్యాపారులు, ఇతరులు వివిధ పనుల కోసం వెళ్లినప్పుడు బైక్‌లను ఎండలో పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి పెట్రోల్ ఆవిరవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెట్రోల్ ఆదా చేయవచ్చు. జాగ్రత్తలివే.. ∙ వాహనాల పెట్రోల్ ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంతమేర పెట్రోల్ ఆవిరికాకుండా చూడవచ్చు. ∙ ఎండల వేడికి ఇంజిన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మంచిది. ∙ సీటు కవర్లు సైతం సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వేడెక్కకుండా ఉండేందుకు వెల్వెట్, పోస్టు క్లాత్ సీట్ కవర్లు వాడాలి. ∙ వేసవిలో ఇంజిన్ గార్డులు తొలగించడం ఎంతో మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ∙ వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూయాలి. ∙ ఎండాకాలంలో వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయాలి. వేసవిలో ఇంజిన్‌కు సరిపడా ఆయిల్ ఉండేట్లు చూసుకోవాలి. టైర్లు, ట్యూబ్‌లు కూడా మంచిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. – -
కారులో వ్యక్తి సజీవ దహనం
సిఫ్‌కాట్ : నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలిగొంది. కారులో మంటలు చెలరేగి సోదరుడి కళ్లెదుటే అన్న సజీవదహనమైన విషాద ఘటన గురువారం హొసూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా, మాస్తికి చెందిన అస్లాం, షమీన్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ జావిద్ (23)కు అదే ప్రాంతంలోని గొల్లపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో అతను తన అన్న సయ్యద్ ఇనాయత్ (24)తో కలిసి గురువారం హొసూరులో ఉన్న బంధువులకు శుభలేఖలు పంచిపెట్టేందుకు మాస్తి నుంచి మారుతీ వ్యాన్‌లో బయల్దేరారు. మార్గం మధ్యలో పెట్రోల్ ట్యాంక్ లీక్ కాగా డ్రైవింగ్ చేస్తున్న సయ్యద్ జావిద్ పసిగట్టాడు. హొసూరులో రిపేరు చేయిద్దామని అన్న పేర్కొనడంతో అలాగే చేరుకొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు హొసూరు-రాయకోట రోడ్డు కూడలిలో వ్యాన్‌లో అకస్మికంగా మంటలు చెలరేగడంతో సయ్యద్జావిద్ కిందకు దూకేశాడు. వెనుకసీట్లో నిద్రిస్తున్న సయ్యద్ ఇనాయత్ మంటల్లో చిక్కుకున్నాడు. కళ్లెదుటే అన్న అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసిన జావిద్ స్పృహకోల్పోయాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించి విఫలమయ్యారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే సయ్యద్ ఇనాయత్ పూర్తిగా సజీవదహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుర్తు పట్టలేని విధంగా మారిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జావీద్‌ను సైతం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో లక్షల విలువైన వ్యాన్ కూడా పూర్తిగా దగ్ధమైంది. కేసు దర్యాప్తులో ఉంది.