
July 14th Gold Silver Prices: దేశంలో వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు పెరిగాయి. అటు వెండి కూడా భారీగా పెరిగింది.(జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్)
22క్యారెట్ల 10గ్రా. పసిడి రూ. 350 పెరిగి, రూ. 55,000కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 ఎగిసి రూ. 60,00కి చేరింది. ముంబై, కోల్‌కతా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000, 24 క్యారెట్ల బంగారం రూ.60,000గా చేరడం గమనార్హం.
అటు హైదరాబాద్‌మార్కెట్లో వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసింది. ప్రస్తుంతం రూ.813మేర పెరిగి కిలో వెండి 81, 300 పలుకుతోంది.
ఇదీ చదవండి: తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?