సాక్షి, ముంబై: ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. తాజాగా మరోసారి రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రోజు విరామం తరువాత, జూన్ 14 న పెట్రోల్ 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి.
తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రికార్డ్‌స్థాయికి చేరాయి.ముంబైలో పెట్రోల్ ఆల్ టైం గరిష్ట స్థాయి 102.58 రూపాయలను తాకింది. అటు హైదరాబాద్‌లో కూడా లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసింది. పెట్రోల్ రూ.100.20వద్ద, డీజిల్ రూ.95.14గా ఉంది. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, లడఖ్ సహా ఏడు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు మార్కుకు రూ .100 పైన ఉంది. మే 4 నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు పెరగడం 25వసారి.
దేశంలోని పలున గరాల్లో పెట్రోలు,డీజిలు ధరలు, లీటరుకు
ఢిల్లీలో పెట్రోల్ ధర 96.41, , డీజిల్ రూ .87.28
కోలకతాలో పెట్రోలు ధర 96.34,, డీజిల్ రూ. 90.12
బెంగళూరులో పెట్రోలు ధర 99.63, డీజిల్ రూ. 92.52
ముంబైలో పెట్రోలు ధర 102.58, డీజిల్ రూ. 94.70
హైదరాబాద్‌లో పెట్రోలు ధర 100.20 , డీజిల్ రూ. 95.14
అమరావతిలో పెట్రోలు ధర 102.31, డీజిల్ రూ. 96.92
చదవండి: ఎన్ఎస్‌డీఎల్: అదానీకి భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment