గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పోరాడి, లాక్‌డౌన్‌లో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడు వాటి నుంచి బయటపడుతున్నారు. అయితే దేశంలో పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారం కావడంతో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ తరుణంలో కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయన్న వార్త వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే.. పండుగ సీజన్ లోపు మరోసారి వాహనాలు ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రూపాయి మారక విలువ బలహీనపడడం, పెరిగిన రవాణా వ్యయం, ఇక గతంలో కోల్పోయిన మార్జిన్లను తిరిగి పొందాలన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు టైర్లు,ఇతర ఆటో పరికరాల ధరలను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల వాహన ధరలు మరింత పైకి కదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే పండుగ సీజన్ కంటే ముందే రేట్ల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.
చదవండి: Tata Power Group Q1 Results: టాటా పవర్ ఫలితాలు: డబుల్ ధమాకా!
Comments
Please login to add a commentAdd a comment