
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్(విజయ పాలు) పాలు లీటర్‌కు రూ.2 పెరగనున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని విజయ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం విజయ లోఫాట్(డీటీఎం) అర లీటర్ ప్యాకెట్ రూ.25 ఉండగా, సోమవారం నుంచి రూ.26 కు విక్రయించనున్నారు.
విజయ ఎకానమి(టీఎం) అరలీటర్ ప్యాకెట్ రూ.27 నుంచి రూ.28కు పెరిగింది. విజయ స్పెషల్(ఫుల్ క్రీమ్) పాలు అర లీటర్ రూ.33 నుంచి రూ.34కు పెరిగింది. ఇక కృష్ణా మిల్క్ యూనియన్ అత్యధికంగా విక్రయించే విజయ గోల్డ్ ప్రస్తుతం రూ.34 ఉండగా, రూ.35కు పెరగనుంది. నెల వారీ పాల కార్డు కొనుగోలు చేసిన వినియోగదారులకు అక్టోబర్ 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని యాజమాన్యం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment