vijaya milk
-
వినియోగదారులకు షాక్.. విజయ పాల ధరలు పెంపు!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్(విజయ పాలు) పాలు లీటర్‌కు రూ.2 పెరగనున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని విజయ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం విజయ లోఫాట్(డీటీఎం) అర లీటర్ ప్యాకెట్ రూ.25 ఉండగా, సోమవారం నుంచి రూ.26 కు విక్రయించనున్నారు. విజయ ఎకానమి(టీఎం) అరలీటర్ ప్యాకెట్ రూ.27 నుంచి రూ.28కు పెరిగింది. విజయ స్పెషల్(ఫుల్ క్రీమ్) పాలు అర లీటర్ రూ.33 నుంచి రూ.34కు పెరిగింది. ఇక కృష్ణా మిల్క్ యూనియన్ అత్యధికంగా విక్రయించే విజయ గోల్డ్ ప్రస్తుతం రూ.34 ఉండగా, రూ.35కు పెరగనుంది. నెల వారీ పాల కార్డు కొనుగోలు చేసిన వినియోగదారులకు అక్టోబర్ 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని యాజమాన్యం పేర్కొంది. -
విజయ పాలు లీటర్ రూ.47
లాలాపేట : విజయ డెయిరీ లీటర్ పాల ధర రూ.47కి చేరింది. తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరి) ఈ రెండు నెలల కాలంలో లీటరు పాలపై రూ.5 పెంచింది. గత రెండు నెలల క్రితమే రూ.2 పెంచింది. తాజాగా మళ్లీ మరోసారి రూ.3 పెంచడంతో విజయ పాల వినియోగదారులు ఈ పెంపు ను భారంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకే విక్రయిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ పాల ధరను అధికంగా పెంచడంతో నాణ్యతకు పేరున్న విజయ పాలను కొనలేని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. దీనిపై విజయ డెయిరి మార్కెంటింగ్‌అధికారులను వివరణ కోరగా.. జనవరి 26న పాడి రైతులకు ప్రొక్యూర్మెంట్ కోసం రూ.2 పెంచామన్నారు. ఆ పెంపును భర్తీ చేయడానికే తాజాగా లీటరు పాల ధరను పెంచాల్సి వచ్చిందన్నారు. ఈ పెంపు ఈ నెల 16 నుంచే వర్తిస్తుందని తెలిపారు. -
నేల‘పాలు’
చిత్తూరు, బి.కొత్తకోట: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న విజయాపాలు నేలపాలవుతోంది. 90 రోజులు నిల్వ ఉంటుందని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. నిల్వ ఉండకపోగా భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ ఘటన బుధవారం బి.కొత్తకోటలో వెలుగుచూసింది. పాలల్లో పురుగులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ప్రభుత్వ డెయిరీ విజయా ద్వారా ప్యాకింగ్ చేసిన పాలను సరఫరా చేస్తోంది. సరఫరా చేసిన పాలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నెల 22న బి.కొత్తకోట మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 500 మి.లీ. పాల ప్యాకెట్లను సరఫరా చేశారు. నిబంధనల ప్రకారం ప్యాకెట్లు 90రోజుల పాటు నిల్వ ఉండాలి. కేంద్రాల పరిధిలోని బరువున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంగా ప్రతిరోజూ 200 మి.లీ.పాలను అందించాలి. దీనికి అనుగుణంగా ప్యాకెట్లు సరఫరా చేస్తారు. మండలానికి సరఫరా చేసిన ప్యాకెట్లు గరళంగా మారాయి. బాక్సుల్లో వచ్చిన ప్యాకెట్లు పగిలిపోయాయి. పాలు కారిపోవడం, ప్యాకెట్లు ఉబ్బిపోయి పగిలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్యాకెట్ల నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోంది. కొన్ని ప్యాకెట్ల నుంచి పురుగులు కూడా వచ్చాయి. వీటిని గమనించిన కేంద్రాల సిబ్బంది దుర్వాసన భరించలేక పారబోశారు. ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మందలిస్తారన్న భయంతో కొందరు మిన్నకున్నారు. నష్టాన్ని భరించాల్సి వస్తుందని మరికొం దరు పరిస్థితిని అధికారులకు తెలియజేశారు. కరువైన పర్యవేక్షణ 90 రోజులు నిల్వ ఉండాల్సిన పాలు కొన్ని రోజులకే పాడవుతున్న విషయంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేద ని తెలిసింది. ఇలాంటి పాలను అందిస్తే రోగాలబారిన పడే ప్రమా దం ఉంది. ఈ పరిస్థితి జిల్లా మొత్తం ఉందని తెలుస్తోంది. అధికా రులు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలుస్తోంది. పాలను సరఫరా చేసే ముందు డెయిరీ అధికారులు పరిశీలిస్తున్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో తయారు కేంద్రాలకు సరఫరా చేస్తున్న 500 మి.లీ. ప్యాకెట్లు కర్ణాటకలోని కోలారుతో తయారు చేయిస్తున్నామని మదనపల్లె విజయా డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ చెప్పారు. ఈ విషయమై బుధవారం ఆయన మాట్లాడుతూ కోలారులోని ప్రయివేటు కేంద్రంలో పాలను ప్యాక్ చేసి సరఫరా చేస్తుందన్నారు. దీనికి కవర్లు తాము సరఫరా చేస్తామని, కేంద్రం పాలను నింపి అందిస్తుందని చెప్పారు. చెడిన పాల ప్యాకెట్లపై విచారణ చేయిస్తామని చెప్పారు. కాగా ప్రయివేటు డెయిరీలో జరుగుతున్న పాల ప్యాకింగ్ పర్యవేక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అమెజాన్ ద్వారా ‘విజయ’ పాలు
సాక్షి, హైదరాబాద్: విజయ పాల పదార్థాలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. బిగ్‌బాస్కెట్ డైలీ, ఫ్లిప్‌కార్ట్, సూపర్ డైలీ వంటి ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా ఇప్పటికే అమ్మకాలు సాగుతుండగా.. వచ్చేనెల నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లోనూ లభ్యం కానున్నాయి. ‘అమెజాన్ నౌ’ ద్వారా విజయ పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల పదార్థాలు అందుబాటులోకి రానున్నాయని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎలాంటి అదనపు కమీషన్ లేకుండా వినియోగదారులకు ప్రస్తుత ధరకే పాలు, పాల పదార్థాలు ఇంటి ముంగిటకు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో దీన్ని అమలు చేస్తున్నామని, త్వరలో ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. హోటళ్ల నుంచి ఆహారం, ఇతర తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గీ సంస్థతోనూ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నామని విజయ డెయిరీ మార్కెటింగ్ వింగ్ ఇన్చార్జి అరుణ్ తెలిపారు. -
విజయ పాల ధర తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: విజయ పాల ధరను లీటరుకు 75 పైసలు తగ్గిస్తూ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు ఆ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ తగ్గింపు నెలవారీ కార్డులున్న వారికే వర్తింపజేస్తామని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నెలవారీ కార్డులకు సొమ్ము చెల్లించాలని ఎండీ విజ్ఞప్తి చేశారు. -
పెరిగిన విజయ పాల ధర
టోన్డ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.1, హోల్ మిల్క్‌పై రూ.3 పెంపు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభి వృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాల ధర పెరిగింది. విజయ పాల ధరను టోన్డ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.1, హోల్మిల్క్పై రూ.3 పెంచుతు న్నట్లు విజయ డెయిరీ అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం లీటర్ టోన్డ్ మిల్క్ ధర రూ.41. జూలై 1 నుంచి లీటర్ టోన్డ్ మిల్క్‌ను రూ.42కి విక్రయించనున్నారు. ధర పెంపునకు వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలోనే రూ.4 భారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ పాల ధరను జనవరి 5న రూ.2 పెంచింది. ఏప్రిల్ 1న రూ.1, తాజాగా మరో రూ.1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై అంటే ఆరు నెలల వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ.4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది. -
విజయ పాల ధర పెరిగింది
జూలై 1 నుంచి అమలు ఈ సంవత్సరంలోనే రూ.4 పెంపు లాలాపేట: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను టోండ్ మిల్క్‌పై లీటరుకు రూ 1 , హోల్ మిల్క్‌పై రూ 3 పెంచుతున్నట్లు విజయ డెయిరి అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిజేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న లీటరు టోండ్ మిల్క్ రూ 41కి అందిస్తున్న పాలు జూలై 1వ తేదీ నుంచి రూ 42 కి విక్రయించనున్నారు. ధర పెంపుకు వినియోగదారులు సహకరించాలనీ అధికారులు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరిగిన పాల దరలు ఇలా.... టైప్ ఆఫ్ మిల్క్ ఫ్యాకేజ్ సైజ్ ప్రస్తుత ధర పెరిగిన ధర 1.హోల్ మిల్క్ 500 ఎం.ల్ రూ. 26.50 రూ .28.00 2.స్టాండడ్జైడ్ మిల్క్ 500 ఎం.ల్ రూ .22.50 రూ .23.00 3.టోండ్ మిల్క్ 1000 ఎం.ల్ రూ. 41.00 రూ. 42.00 4.టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .20.50 రూ. 21.00 5.టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ. 8.50 రూ .8.50 6.ఫ్యామిలీ మిల్క్ 500 ఎం ల్ రూ .19.50 రూ .20.00 7.డబుల్ టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .18.50 రూ .19.00 8.డబుల్ టోండ్ మిల్క్ 300 ఎం ల్ రూ. 11.00 రూ .11.00 9.డబుల్ టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ .8.00 రూ .8.00 10.డైట్ మిల్క్ 500 ఎం.ల్ రూ .17.50 రూ .18.00 11.కౌ మిల్క్ 500 ఎం ల్ రూ .20. 50 రూ .21.10 ఈ సంవత్సరం లోనే రూ .4 భారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరి సరఫరా చేస్తున్న పాలను లీటరుపై జనవరి 5 తేదీన రూ 2 ను పెంచింది. ఏప్రిల్ 1 న రూ 1, తాజాగా మరో రూ 1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ 4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది.