
పెరిగిన విజయ పాల ధర
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభి వృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాల ధర పెరిగింది.
టోన్డ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.1, హోల్ మిల్క్‌పై రూ.3 పెంపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభి వృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాల ధర పెరిగింది. విజయ పాల ధరను టోన్డ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.1, హోల్‌మిల్క్‌పై రూ.3 పెంచుతు న్నట్లు విజయ డెయిరీ అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం లీటర్ టోన్డ్ మిల్క్ ధర రూ.41. జూలై 1 నుంచి లీటర్ టోన్డ్ మిల్క్‌ను రూ.42కి విక్రయించనున్నారు. ధర పెంపునకు వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సంవత్సరంలోనే రూ.4 భారం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ పాల ధరను జనవరి 5న రూ.2 పెంచింది. ఏప్రిల్ 1న రూ.1, తాజాగా మరో రూ.1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై అంటే ఆరు నెలల వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ.4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది.