
బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా ఉండటంతో మంగళవారం రూ.125 పెరిగి 10గ్రా. బంగారం రూ.33,325కి చేరింది. అయితే, వెండి మాత్రం బలహీనపడింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడమేతో కిలో వెండి ధర రూ.40వేల దిగువకు చేరింది. మంగళవారం 250 రూపాయలు క్షీణించిన వెండి కిలో ధర రూ. 39,850 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు పెరిగి రూ.33,325వద్ద,22 క్యారెట్ల బంగారం ధర రూ.32,175కి చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రా పసిడి ధర రూ. 32, 835గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా 0.13 తగ్గి, ఔన్స్ గోల్డ్ ధర 1278.9 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.46శాతం క్షీణించి 15.26డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment