న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 2022 డిసెంబర్ నెలలోనూ గణనీయ వృద్ధిని చూశాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనులకు వీటికి డిమాండ్ ఏర్పడడం ఈ వృద్ధికి దోహదపడినట్టు చెప్పుకోవాలి. పెట్రోల్ విక్రయాలు 2.76 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2021 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే 8.6 శాతం అధికం. ఇక 2020 డిసెంబర్ తో పోల్చినప్పుడు 13 శాతం, 2019 డిసెంబర్‌తో (కరోనాకు ముందు) పోల్చి చూసినప్పుడు 23 శాతం చొప్పున వృద్ధి కనిపించింది. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అటు డీజిల్ అమ్మకాలు సైతం 2021 డిసెంబర్ నెలతో పోలిస్తే 2022 డిసెంబర్‌లో 13 శాతం పెరిగి 7.3 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్ నెల కంటే 15 శాతం, 2019 డిసెంబర్ కంటే 11 శాతం అధికం. ఇక 2022 నవంబర్ నెల విక్రయాలతో పోల్చినప్పుడు 0.5 శాతం తగ్గాయి.
ఇతర ఇంధనాల వినియోగమూ పైపైకే
వ్యవసాయ రంగంలో వినియోగం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇరిగేషన్ పంప్‌లు, ట్రక్‌ల కోసం డీజిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని తెలిసిందే. 2022 జూన్ నుంచి చూస్తే మధ్యలో జూలై, ఆగస్ట్‌లో మాత్రం అధిక వర్షాలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలకు కొంత డిమాండ్ తగ్గగా, మిగిలిన నెలల్లో జోరుగా కొనసాగింది. విమాన ప్రయాణికుల రద్దీ కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. దీంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) విక్రయాలు గత నెలలో 18 శాతం వృద్ధి చెంది 6,06,000 టన్నులుగా ఉన్నాయి. 2020 డిసెంబర్‌తో పోల్చినప్పుడు 50 శాతం అధికంగా ఉన్నాయి. వంటగ్యాస్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 2.72 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే వృద్ధి 6 శాతానికి పైనే ఉంది.
పెట్రోల్, డీజిల్ భారీ అమ్మకాలు
Published Mon, Jan 2 2023 6:27 AM | Last Updated on Mon, Jan 2 2023 6:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment