గతేడాది మనదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో రూ.100 నుంచి రూ.110 మధ్య ఉండగా.. డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100 మధ్యకు చేరాయి. దీంతో వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.అయితే, రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు, నిత్యవసర వస్తువల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.
పెరగనున్న ధరలపై ప్రజలు ఎంత ఖర్చు చేస్తారు. పెరుగుతున్న ధరలు, నామమాత్రపు ఆదాయంతో ప్రజలు వారి జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఉక్రెయిన్-రష్యా వివాదం కారణంగా ముడిచమురు ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఎలా ఖర్చు చేస్తారో లోకల్ సర్కిల్స్ సంస్థ తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశంలోని 361 జిల్లాలకు పైగా ఉన్న పౌరుల నుండి సర్వే చేయగా.. ఆ సర్వేకు 66శాతం మంది పురుషులు, 34శాతం మంది మహిళలు 27వేల మంది స్పందించారు.
ఆ సర్వేలో పాల్గొన్న ప్రజల అభిప్రాయం ఆధారంగా ఈ ఏడాది తమ సంపాదన తగ్గిపోతుందని ప్రతి రెండు కుటుబాలకు చెందిన వ్యక్తులు నమ్ముతున్నారు. 35 శాతం మంది ఆదాయం అలాగే ఉంటుందని చెప్పగా నాలుగు శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని చెప్పారు.
2022 పొదుపు చేయడం చాలా కష్టమని ప్రతి రెండు కుటుంబాల్లో ఒక ఇంటి సభ్యుడు నమ్ముతున్నాడు. 11 శాతం కుటుంబాలు మాత్రమే పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఆరు శాతం కుటుంబాలు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతాయని చెప్పారు. మొత్తం మీద, రెండు కుటుంబాలలో ఒకరు తమ పొదుపు 2022లో తగ్గిపోతుందని విశ్వసించగా, 11 శాతం మంది మాత్రమే అది పెరుగుతుందని విశ్వసించారు.
పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరగడాన్ని తాము సహించలేమని సర్వేలో పాల్గొన్న 42 శాతం భారతీయ కుటుంబాలు తెలిపాయి. వీరిలో 24 శాతం కుటుంబాలు ఇప్పటికే తమ విచక్షణ ఖర్చులను తగ్గించుకున్నట్లు చెప్పాయి. కేవలం 22 శాతం కుటుంబాలు మాత్రమే “స్వల్పకాలిక పెరుగుదలను తట్టుకోగలవు” అని, తొమ్మిది శాతం మంది “20 శాతం వరకు”, ఏడు శాతం మంది “10 శాతం వరకు”, 16 శాతం మంది “5 శాతం వరకు” అని చెప్పారు.
కాగా కోవిడ్ ప్రభావం, ఉక్రెయిన్ - రష్యాదేశాల మధ్య అనిశ్చితి కారణంగా ఈ ఏడాది భారతీయుల ఆదాయాలు, పొదుపులు తగ్గుతాయని లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment