కల్తీ.. కలవరం
జడ్చర్ల:
జిల్లాలో వాహనదారులను ఇంధనకల్తీ కలవరపెడుతోంది. ఏ బంకులో పెట్రోల్, డీజిల్‌ను పోయించుకుంటే ఏం జరుగుతోందోనని ఆందోళనకు గురవుతున్నారు.
బాదేపల్లిలోని పెట్రోల్‌బంకులో నసరుల్లాబాద్‌కు చెందిన ఓ ట్రాక్టర్‌డ్రైవర్ డీజిల్ పోసుకుని వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లగానే ట్రాక్టర్ ఆగిపోయింది. ఇదేంటి.. ఇంజన్‌లో లోపమేదైనా ఉందేమోనని మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. డీజిల్‌ట్యాంకును తెరిచిచూస్తే నీళ్లున్నట్లు తేలడంతో బిత్తరపోయాడు.
మిడ్జిల్‌కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టించి కొద్దిగా కదిలాడో..లేదో సేపటికే బైక్ ఆగిపోయింది. ట్యాంక్ తెరిచి చూస్తే పెట్రోల్‌లో డీజిల్‌కల్తీ ఉండడంతో ఆగిపోయింది.
జడ్చర్లలోని మరో పెట్రోల్ బంకు వద్ద ఉదయా న్నే ఓ యువకుడు లీటర్‌పెట్రోల్ కొట్టించి ముం దుకు కదిలాడు. బంకు దాటాడో లేదో బైక్ ఆగి పోయింది. ట్యాంకును తెరిచిచూస్తే ఒక చుక్క పె ట్రోల్‌లేదు. ఇదేమిటని బంకు యజమానులను నిలదీస్తే అయ్యో..! అలా జరిగిందా.. అలా కా కూడదే..! అంటూ సమర్థించుకున్నారు. ఇలా ఒక రు కాదు.. ఇద్దరు కాదు.. రోజూ ఎంతోమంది క ల్తీ పెట్రోల్, డీజిల్ పోయించుకుని అవస్థలు పడినవాళ్లే.
జడ్చర్ల:
జిల్లాలో వాహనదారులను ఇంధనకల్తీ కలవరపెడుతోంది. ఏ బంకులో పెట్రోల్, డీజిల్‌ను పోయించుకుంటే ఏం జరుగుతోందోనని ఆందోళనకు గురవుతున్నారు. వేలకువేలు వెచ్చించి కొనుగోలుచేసిన తమ వాహనాల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. జడ్చర్ల కొత్త బస్టాండ్‌కు సమీపంలోని పోలీస్‌స్టేషన్ వద్ద హైవేను అనుసరించి ఉన్న ఓ ఫిల్లింగ్‌స్టేషన్‌పై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు జరిపగా..పెట్రోల్, డీజిల్‌లో భారీగా కిరోసిన్‌ను కలుపుతున్నట్లు వెల్లడైంది. ఆ పక్కనే ఉన్న చిన్నషెడ్డులో విద్యుత్ మోటార్‌కు పైపులను కలిపి నేరుగా ట్యాంకు నుంచి పెట్రోల్, డీజిల్ పంపులకు అనుసంధానం చేసి ఇంధనకల్తీకి పాల్పడుతున్నారు. ఈ తతంగం ఎన్నో రోజులుగా జరుగుతున్నా.. క నీసం వాహనదారులు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. ఇలా జిల్లాలో చాలా పెట్రోల్‌బంకుల్లో ఇంధనకల్తీ జరుగుతున్నట్లు తెలుస్తుండడంతో వాహనదాదారులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, కంపెనీ ప్రతినిధులు నిబంధనలకు నీళ్లొదిలి నిర్వాహకులతో కుమ్మక్కుకావడంతోనే కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జడ్చర్లలోని ఫిల్లింగ్‌స్టేషన్‌లో జరుగుతున్న అక్రమాల విషయంలో ఇదే జరిగిందని చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో కనీస నిబంధనలు పాటించడం లేదు. వినియోగదారులకు తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల టైర్లకు గాలిసౌకర్యం, బిల్లులు ఇవ్వడం, తదితర సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తున్నారు.
గతంలోఇలా: మిడ్జిల్ మండల కేంద్రం లోని బంకులో పెట్రోల్‌ట్యాంకులో డీజి ల్‌ను డంప్‌చేసి యజమానులు విక్రయిం చారు. బైక్‌లో కొంత పెట్రోల్ పోయించి కొద్దిదూరం వెళ్లగా.. అది ఆగిపోవడంతో కంగుతినాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కల్తీపెట్రోల్‌ను పోయించుకున్న బైక్‌లు మరమ్మతుకు గురయ్యాయని వాహనదారులు మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. అదేవిధంగా బాదేపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో డీజిల్ ట్యాంకులో నీళ్లున్నాయని విచారణలో తేలినా అధికారులు చేష్టలుడిగి చూశారు. ఇకనైనా అధికారులు స్పందించి బంకుల్లో ఇంధనవిక్రయాలు నాణ్యతగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.