వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌..! | Budget 2022 Petrol May Cost More Imposed On Unblended Fuel From Oct 1 | Sakshi
Sakshi News home page

వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌..! మరోసారి ఇంధన ధరల పెంపు..ఎప్పటి నుంచంటే..?

Published Wed, Feb 2 2022 4:50 PM | Last Updated on Wed, Feb 2 2022 7:05 PM

Budget 2022 Petrol May Cost More Imposed On Unblended Fuel From Oct 1 - Sakshi

ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్‌ బడ్జెట్‌-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్‌ కొంతమందికి ఊరటను కల్పించిన మరికొందరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ప్రతిపక్షాలు బడ్జెట్‌పై తీవ్ర విమర్శలను చేశాయి. బడ్జెట్‌లో పెట్రోల్‌, డిజీల్‌పై తీసుకున్న నిర్ణయం మరోసారి వాహనదారులకు షాక్‌ తగలనుంది. దీంతో పెట్రోల్‌, డిజీల్‌ ధరలు లీటర్‌కు రూ. 2 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కారణం అదే..! పెంపు అప్పటి నుంచే..!
ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే ప్రతిపాదనను  బడ్జెట్ 2022లో పొందుపరిచారు. దీంతో అన్‌బ్లెండెడ్‌ ఫ్యూయల్‌పై లీటరుకు రూ. 2 పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనతో చాలా ప్రాంతాల్లో 2022 అక్టోబర్ 1 నుంచి డీజిల్‌పై అదనపు బాదుడును కేంద్రం విధించనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పెట్రోలు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. 

ఉద్గారాలను తగ్గించేందుకు..!
మిక్స్‌డ్‌ పెట్రోల్‌, డీజిల్‌ను వాడడంతో తక్కువ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్‌లో నాన్-బ్లెండెడ్‌ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

90 డాలర్లు దాటిన బ్యారెట్‌ క్రూడ్‌ ఆయిల్‌..!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది.ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్‌ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్‌ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 90 డాలర్లకు చేరిన భారత్‌లో ఇప్పటివరకు ఇంధన ధరల్లో మార్పు రాకపోవడం విశేషం.

చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్‌ టెన్షన్‌..! ఇంధన ధరలు రయ్‌ అంటూ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement