న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలు జులైలో తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురియడం ఇంధనాల వినియోగం తగ్గేలా చేసింది. డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. కానీ, క్రితం ఏడాది జూలై నెలలోని వినియోగంతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో వినియోగం 17 శాతం అధికంగా ఉంది.
ఇక 2020 జూలై నెల గణాంకాలతో పోలిస్తే ఏకంగా 32 శాతం అధికం కావడం గమనించాలి. 2020లో కరోనా ఆంక్షల కారణంగా వినియోగం గణనీయంగా పడిపోయింది. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఏటీఎఫ్ (విమాన ఇంధనం) విక్రయాలు జూలైలో 79 శాతం పెరిగి 5,33,600 టన్నులుగా ఉన్నాయి. ఎల్‌పీజీ విక్రయాలు సైతం 4 శాతం పెరిగి 2.46 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment