సాక్షి,వెబ్‌డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. జూన్ నెలలో పదో సారి ఇందన రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేస్తున్నాయి. ఆయిల్ రిటైలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర రూ. 96.93 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ.87.69 వద్ద కొనసాగుతుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.08 ఉండగా.. డీజిల్ ధర రూ.95.14కు చేరింది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.14 ఉండగా..డీజిల్ రూ. 92.31 కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.84 గా ఉంటే లీటర్ డీజిల్ రూ. 90.54కు చేరింది. ఇక భోపాల్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.13 ఉండగా డీజిల్ ధర రూ. 96.35 వద్ద ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.17 ఉండగా డీజిల్ రూ. 92.97 వద్ద అమ్ముడవుతోంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 108.07 ఉండగా డీజిల్ ధర.100.82 గా ఉంది. ఇక మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీకి చేరాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,లడఖ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కు చేరింది. కాగా,హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.74, డీజిల్ రూ.95.59, విజయవాడలో పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.96.97 కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment