హైదరాబాద్: ఇంధన ధరల పెరుగుదలలో పెట్రోల్‌ని డీజిల్ క్రాస్ చేసింది. గత నలభై నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే... పెట్రోలు కంటే డీజిల్ ధరలే ఎక్కువగా పెరిగాయి. గడిచిన 44 రోజుల్లో ఇంధన ధరలను 25 సార్లు పెంచాయి చమురు కంపెనీలు. ఇలా 25 సార్లు పెరిగిన ధరల మొత్తాన్ని కలిపితే లీటరు పెట్రోలుపై రూ. 6.26 డీజిల్‌పై రూ. 6.68 ధర పెరిగింది. మొత్తంగా పెట్రోలు కంటే డీజిల్ ధర 42 పైసలు ఎక్కువగా పెరిగింది.
సెంచరీ దిశగా డీజిల్
బెంగాల్ ఎన్నికలు ముగిసింది మొదలు చమురు కంపెనీలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పేరు చెప్పి ఇంధన ధరలు పెంచుకుంటూ పోయాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర వంద దాటగా తాజాగా డీజిల్ సెంచరీకి చేరువగా వస్తోంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వందను దాటేసింది. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 100.51గా నమోదైంది. ఇదే ట్రెండ్ మరో నెలరోజులు కంటిన్యూ అయితే తెలుగు స్టేట్స్‌లోనూ లీటరు డీజిల్ ధర వందను దాటం ఖాయమనేట్టుగా ఉంది పరిస్థితి.
చదవండి : హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment