సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా,గత శనివారం లీటర్ పెట్రోల్‌పైన 30పైసలు పెరిగింది. ఆ తర్వాత ఆదివారం నుండి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై నెల 20రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి...మే 3 నుంచి ఇప్పటివరకూ వరుసగా 5 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం.
గత ఆదివారం ఒపెక్, అనుబంధ దేశాలు ఆగస్ట్ నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. ఈ ఒప‍్పందం నేపథ్యంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస‍్తున్నారు.
ఇక గురువారం రోజు పెట్రోల్ ధరల వివరాలు
హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది
ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది
చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది
బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది
Comments
Please login to add a commentAdd a comment