
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో..దేశ వ్యాప్తంగా మరోమారు పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయి.
చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
వరుసగా ఐదవ రోజూ ఆదివారం (అక్టోబర్ 24, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.96.32పైసలు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.46పై., డీజిల్ రూ.104.38కు చేరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కి చేరింది. డీజిల్ రూ.105.08 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.52, రూ.106.11 గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.111.34, రూ.102.23 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59.
ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్‌ల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉండనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలూ 19 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 85 డాలర్లకు చేరుకుంది.
చదవండి: 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్‌సైట్! ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment