Ticket Reservation
-
మరో షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఈసారి ఏకంగా రూ.10
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెస్సుల పేరుతో చార్జీలు పెంచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పెరిగిన రిజర్వేషన్ చార్జీలు మార్చి 27 నుంచి అమలు కానున్నట్టు సమాచారం. (చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..) -
దయచేసి వినండి.. రైలు ప్రయాణికులకు గమనిక
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ తాజాగా మరిన్ని కోవిడ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు వెయిటింగ్‌లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కిన తరువాత కొంత మొత్తం రుసుము చెల్లించి ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను అనుమతించబో మని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలు ఇవీ.. అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే రిజర్వేషన్లేని ప్రయాణికులను అనుమతిస్తారు. కోవిడ్ దృష్ట్యా ప్రీపెయిడ్ కేటరింగ్ సౌకర్యాన్ని రద్దు చేశారు. తాజా నిబంధనల మేరకు ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్‌తో పాటే గతంలో లాగా ఆహారపదార్థాలను బుక్ చేసుకొనేందుకు అవకాశం లేదు. ‘రెడీ టు ఈట్ భోజనం’, ప్యాక్ చేసిన ఐటమ్స్ మాత్రమే రైళ్లలో లభిస్తాయి. ఐఆర్సీటీసీ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై దుప్పట్లు ఇవ్వరు. ఈ నిబంధనలు తప్పనిసరి.. రైల్వేస్టేషన్లు, రైళ్లలో కచ్చితంగా ఫేస్‌మాస్కులను ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్‌లో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. గమ్యస్థానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలి. మరో 28 రైళ్లు రద్దు సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను తాజాగా రద్దు చేసింది. ఈ నెలాఖరుకు కొన్ని..జూన్ మొదటి వారానికి మరికొన్ని రైళ్లు నిలిచిపోనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం మీడియాకు వెల్లడించారు. తిరుపతి–విశాఖపట్నం, సికింద్రాబాద్–కర్నూలుసిటీ, కాకినాడ టౌన్–లింగంపల్లి, కాకినాడ టౌన్–రేణిగుంట, విజయవాడ–లింగంపల్లి, కరీంనగర్–తిరుపతి, గూడూరు–విజయవాడ, నాందేడ్–జమ్ముతావి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, బిట్రగుంట–చెన్నై, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్, నర్సాపూర్–నాగర్సోల్, సికింద్రాబాద్– విజయవాడ, హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ తదితర రూట్లలో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు రద్దైన వాటిలో ఉన్నాయి. -
ఆర్టీసీ సమ్మె: మా టికెట్ రిజర్వేషన్ల సంగతేంటి?
సాక్షి హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ, దసరా పండగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్దరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. అయితే ముందుగా ప్లాన్ చేసుకొని టికెట్ రిజర్వేషన్లు చేసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తారా లేక టికెట్ కాన్సిల్ చేసి తిరిగి డబ్బులు ఇచ్చేస్తారా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వటం లేదు. దీంతో తమ ప్రయాణానికి సంబంధించి ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నవారు ప్రయాణానికి సిద్దం కావాలా లేక రద్దు చేసుకోవాలో తెలియక డైలమాలో పడ్డారు. అంతేకాకుండా టికెట్ రిజర్వేషన్‌ను ఇప్పుడు(సమ్మె కారణంగా) రద్దు చేసుకున్నా డబ్బులు కట్ అవుతున్నాయని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ప్రయాణం రద్దు చేసుకుని, టికెట్లను కాన్సిల్ చేయకుండా ఉంటే డబ్బులను తిరిగి ఇస్తారో లేదో అని మరికొందరు అనుమానపడుతున్నారు. ఇక ఈ విషయమై అడుగుదామని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు పలువురు వెళితే సమాచార, రిజర్వేషన్ కౌంటర్లు మూసి ఉండటంతో కంగుతింటున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న వారి సంగతేంటో అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: లైవ్ అప్డేట్స్: నిలిచిన బస్సులు.. ప్రయాణికుల కష్టాలు డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం.. -
టీఎస్ఆర్టీసీలో లింక్ టికెట్ పథకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు లింక్ టికెట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు సమీప నగరాల నుంచి మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఈ లింక్ టికెట్ పథకం ద్వారా ఇకపై వారు నివసించే గ్రామం నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్‌తో ఏ బస్సులో అయినా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు అనేక లాభాలు కలుగుతాయని ఆర్ఎం యాదగిరి తెలిపారు. ప్రయాణికులు అంతా దీనిని వినియోగించుకోవాలని సూచించారు. టికెట్ కొనుగోలు చేసిన వారు ప్రయాణపు తేదీ రోజున సర్వీస్ బయల్దేరే ముందు 6 గంటల్లోపు తమ టికెట్టును కండక్టర్‌కు చూపించి ప్రయాణించవచ్చు. -
రైలు ఆర్ఏసీ బెర్తుల పెంపు
న్యూఢిల్లీ: మరింత మంది ప్రయాణికులకు స్లీపర్ తరగతిలో చోటు కల్పించేలా రైల్వే శాఖ ఆర్ఏసీ బెర్తుల సంఖ్యను పెంచింది. ఈ నిర్ణయం జనవరి 16 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం స్లీపర్ బోగీల్లో ఉన్న 5 ఆర్ఏసీ బెర్తులను 7కు పెంచారు. దీని వల్ల 10 మందికి బదులు 14 మందికి స్థానం దొరుకుతుంది. 3 ఏసీ కోచ్‌లలో ప్రస్తుతం ఉన్న 2 ఆర్ఏసీ బెర్తులను 8 మందికి చోటు కల్పించేలా 4కు పెంచారు. 2 ఏసీ కోచ్‌లలో ఈ బెర్తులను 2 నుంచి 3కు పెంచారు. దీంతో ఆరుగురికి స్థానం లభిస్తుంది. ఆర్ఏసీ టికెట్‌దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ కొనుగోలుదారులు సమయానికి రైలెక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్ఏసీ టికెట్ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు. -
నో ఎక్స్ట్రా చార్జ్
ప్రొద్దుటూరు: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే తమ టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ వ్యవహారం జిల్లాలోని అన్ని డిపోల్లో జరుగుతోంది. సాధారణంగా ఆర్టీసీ అధికారులు ఉన్న సర్వీసులకు మినహా కొత్తగా ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే విధానాన్ని అనవాయితీగా పెట్టుకున్నారు. టికెట్లను బట్టి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాలకు సైతం సూపర్ లగ్జరీ స్థానంలో డీలక్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ప్రొద్దుటూరు నుంచి రూ.300 టికెట్ ఉంటే స్పెషల్ సర్వీసు పేరుతో రూ.450 వసూలు చేస్తున్నారు. సీజన్, అన్ సీజన్ లేకపోయినా కొత్త సర్వీసు ఏర్పాటు చేస్తే ఈ విధంగా చార్జీలను వసూలు చేస్తుంటారు. అయితే ఇక నుంచి ప్రత్యేక సందర్భాలు (పండుగలు, ఉత్సవాలు) మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డబ్బు చెల్లించిన ప్రయాణికులకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో సోమవారం రాత్రి నుంచే అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులకు సంబంధించిన అదనపు డబ్బును ప్రయాణికులకు తిరిగి చెల్లించడం మొదలైంది. ఆర్టీసీ అధికారులను ఈ విషయంపై న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇది కొత్త నిబంధన ఏమీ కాదని తొలి నుంచి ఉన్నదేనన్నారు. పండుగ వేళల్లో మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దన్నారు. ఒక్క ప్రొద్దుటూరులోనే ఇప్పటికే 10 స్పెషల్ సర్వీసులకు సంబంధించిన సీట్లు రిజర్వ్ కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులు ఏర్పాటు కాగా వారందరికి ఆర్టీసీ యాజమాన్యం డబ్బు తిరిగి చెల్లిస్తోంది. -
స్పెషల్ బస్సులు రెడీ
రోడ్డెక్కనున్న ఏడువేల బస్సులు నేటి నుంచి పరుగులు కోయంబేడులో ప్రత్యేక కౌంటర్లు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు రాష్ర్ట రవాణాశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ బస్సులు శనివారం నుంచి పరుగులు తీయనున్నాయి. టికెట్ రిజర్వేషన్ నిమిత్తం కోయంబేడులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. చెన్నై: సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే. భోగి, సంక్రాంతి, పశువుల పండుగ రోజుల్లో గ్రామగ్రామాన సందడే. ఈ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకునేందుకు ఎక్కడెక్కడి వారు సొంత గ్రామాలకు చేరుకుంటుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే యంత్రాంగం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల వైపుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. అన్ రిజర్వుడ్‌లో ఇసుకేస్తే రాలనంతగా జనం పయనించాల్సి ఉంది. అలాగే ఆమ్నీ బస్సుల దోపిడీ రెట్టింపు అవుతోంది. ప్రయాణికుల ఇబ్బందుల్ని గుర్తెరిగిన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు సిద్ధమైంది. నేటి నుంచి పరుగులు చెన్నై కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి సాధారణంగా నడిచే బస్సులతోపాటుగా సంక్రాంతి స్పెషల్‌గా 7250 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించారు. చెన్నై నుంచి అన్ని జిల్లా కేంద్రాల కు, నగరాలు, పట్టణాలకు ఈ బస్సులను నడపనున్నారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతా లకు, చెన్నైకి అదనపు బస్సులు పయనించనున్నాయి. సంక్రాంతికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దృష్ట్యా శనివారం నుంచే బస్సుల్ని నడిపేందుకు రంగం సిద్ధమైంది. చెన్నై నుంచి శనివారం 600, 11న 470, 12న 720, 13న 1408, 14న 1456 బస్సుల్ని నడపనున్నారు. ఈ నెల 15న ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సుల్ని రోడ్డెకించనున్నారు. శనివారం నుంచి ఇతర ప్రాంతాల నుంచి చెన్నై, తదితర ప్రాంతాలకు 300 బస్సులు, 11న 400, 12న 500, 13న 595, 14న 800 వందలు బస్సులు రోడ్డెక్కనున్నాయి. పండుగను ముగించుకుని తిరుగు పయనం అయ్యే వారికి కోసం 16 నుంచి 19వ తేదీ వరకు పై సంఖ్యలోనే బస్సులు పరుగులు తీస్తాయి. 300 కిమీ పైబడి పయనించేవారు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కోయంబేడు బస్టాండ్ ఆవరణలో 25 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. చెన్నై నగరంలో.. చెన్నై మహానగరంలోనూ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి నగర వాసులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ఆనవాయితీ. కనుమ, ముక్కనుమ రోజుల్లో పర్యాటక కేంద్రాలు జన సందోహంతో నిండి ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయంబేడు, ప్యారిస్, టీ.నగర్, తాంబరం తదితర ప్రధాన బస్టాండ్ల నుంచి కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు, పళ్లికర నై, వీజీపీ, కిష్కిందా, క్వీన్స్ లాండ్, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లు తదితర పర్యాటక కేంద్రాల మీదుగా 250 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.