హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు లింక్ టికెట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు సమీప నగరాల నుంచి మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఈ లింక్ టికెట్ పథకం ద్వారా ఇకపై వారు నివసించే గ్రామం నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు.
అలాగే ఈ టికెట్‌తో ఏ బస్సులో అయినా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు అనేక లాభాలు కలుగుతాయని ఆర్‌ఎం యాదగిరి తెలిపారు. ప్రయాణికులు అంతా దీనిని వినియోగించుకోవాలని సూచించారు. టికెట్ కొనుగోలు చేసిన వారు ప్రయాణపు తేదీ రోజున సర్వీస్ బయల్దేరే ముందు 6 గంటల్లోపు తమ టికెట్టును కండక్టర్‌కు చూపించి ప్రయాణించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment