
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎంబీసీ సెల్ కోకన్వీనర్‌గా సూర్యపల్లి శ్రీనివాస్‌ను నియమించినట్టు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు పార్టీలో ప్రాతినిథ్యం కల్పించేందుకు ఎంబీసీ సెల్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ బలోపేతానికి పాటు పడాలని శ్రీనివాస్‌కు ఈ సందర్భంగా భాస్కర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
బీజేపీ బలోపేతానికి కృషి
అత్యంత వెనుకబడిన కులాలను భాగస్వాములను చేసి బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సూర్యపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఆలె భాస్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు.