OBC Morcha
-
తెలంగాణలో ఓబీసీలకు సముచిత స్థానం.. ప్రధాని హామీ: సురేష్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యులు పెరిక సురేష్ పేర్కొన్నారు. ప్రతాప్‌గఢ్ ఎంపీ సంగమ్ లాల్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఓబీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వెనుక బడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచి తోడ్పాటు అందిస్తామని హామీ నిచ్చినట్లు సురేష్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేక విధానాలతో ఓబీసీలు విసిగిపోయి బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారని, అయితే జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందరి కృషితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని హామీనిచ్చారని సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్.. -
నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు
రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాల్సిన కొన్ని పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ‘ఆగర్భ శతృత్వం’తో పని చేస్తున్నాయి. అందులో ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉండడం విశేషం. నిస్వార్థ రాజకీయాలు దేశంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయన్న ఆందోళనతో ‘వ్యక్తిత్వ హననం’ చేస్తూ కుటిల రాజకీయా లకు తెరతీశాయి. ఇప్పుడు ఆ వరుసలోకి కేసీఆర్ సారథ్యం లోని టీఆర్ఎస్ అగ్రస్థానం తీసుకున్నది. గత నెల నుండి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే వర్గాలకు కేసీఆర్ నియంతృత్వ, ధన రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయి. రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన గవర్నర్‌ను ఒక మహిళ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమాన పరుస్తున్న కేసీఆర్ అండ్ కో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. రోజూ ప్రజాస్వామ్య పాఠాలు వల్లించే కమ్యూని స్టులకు కొత్తగా కేసీఆర్ స్నేహం దొరికింది. సీఎంను మెప్పించడం కొరకు ‘కోతికి కొబ్బరిచిప్ప’ దొరికినట్లుగా గవర్నర్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అతి చిన్న వయసులో మంత్రిపదవి కూడా లెక్కపెట్టకుండా ‘న్యాయం కోసం’ రాజీనామా చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్... అక్కడి కమ్యూనిస్టుల దురాగతాలు ఒక్కొక్కటి బయటపెడుతూంటే ఆ అక్కసును కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళగక్కడం విచిత్రం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు చదువుకొనే విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామక బిల్లు లోని లొసుగులతో ప్రభుత్వ పెద్దలు తప్పు చేసేందుకు అవ కాశం ఉంది. దానికి తగిన సవరణలు చేయాలని గవర్నర్ సూచిస్తే తమ వందిమాగధులలో దుష్ప్రచారం చేయిస్తూ కేసీఆర్ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే అణ గారిన వర్గాలకు చెందిన యువత చదువులపై సమ్మెట దెబ్బలా ఎక్కడా లేనివిధంగా తన అస్మదీయులకు, తస్మదీ యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టింది. ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి గవర్నర్ పేరు చెప్పి నియామకాలు జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కామన్ రిక్రూట్ బోర్డు 1953లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రిజ ర్వేషన్ల విషయంలో విధిగా పాలించాల్సిన రోస్టర్ పాయింట్లు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బోర్డు ఏ రోస్టర్ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది అనేది ప్రశ్న. ఓవైపు పోడు భూములకు సంబంధించిన పట్టాలు గిరిజనులకు ఇస్తాం అంటూనే, మరోవైపు వాళ్ళపై నిఘా పెట్టండని అటవీ అధి కారులను ఉసిగొల్పి ఓ నిజాయితీ గల ఆఫీసర్ హత్యకు కేసీఆర్ ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ భూములను అమ్ముతూ, అలా వచ్చిన ఆదా యాన్ని తమ సొంత నియోజకవర్గాలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు తరలించుకు పోతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, విద్య, వైద్య వ్యవస్థలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు తయారయ్యాయి. గవర్నర్ దగ్గర ఎన్నో బిల్లులు ఆగా యని ఓ వైపు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తప్పని సరిగా వెళ్ళాల్సిన చోటు రాజ్‌భవన్. కానీ ఆయన ప్రతి దానినీ రాజకీయ కోణంలో చూస్తూ గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. గ్లోబరీనా టెండర్లను తనవారికి ఇప్పించి ఆ సంస్థ తప్పిదాలతో ఎందరో ఇంటర్ విద్యార్థులు మరణించినా కేసీఆర్ కనికరించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలి గించలేదు. అలాగే ధరణి పోర్టల్ అనే భూమాయను సృష్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకొనేందుకు కారణం అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు ఎమ్మా ర్వోలపై పెట్రోల్ దాడులు చేయడం ఈ రాష్ట్రంలోనే చూశాం. చివరికి ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిర్వహించే ఆరోగ్య శాఖ వైఫల్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు విక టించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఎవరి పాపమో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. గరీబులను వంచించే సరికొత్త ‘గడీ’గా కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించుకొని కుట్రలకు, కుహకాలకు కేంద్రంగా దానిని తయారు చేశారు. బూర నర్సయ్యగౌడ్ లాంటి సీనియర్ నాయకుడు భాజపాలోకి రాగానే బెంబేలెత్తిన కేసీఆర్ మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సరిక్రొత్త కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ప్రగతి భవన్లో కూర్చొని ‘ఫాంహౌస్ బ్లాక్ బస్టర్ సినిమా’కు స్క్రిప్ట్ రచించారు. అనామకులు ఎవరో ఏదో మాట్లాడుకున్న వీడి యోలకు లేని స్క్రిప్ట్ తయారుచేసి జనం మీదకు వదిలారు. నిఖార్సుగా, నిజాయితీగా రాజకీయం చేసే భాజపాపై బురద చల్లేందుకు సరిక్రొత్త ‘కపట నాటకం’ కేసీఆర్‌కు పనికివచ్చింది. తన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తెలం గాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదిగిన భాజపాను బూచిగా చూపిస్తూ... సొంతపార్టీ వారిపైనే బ్లాక్ మెయి లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భాజపాపై ఎదురుదాడికి దిగాలని ప్రగతి భవన్ మీటింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం తెలంగాణలో జరుగుతున్న దాడుల రాజకీయానికి నాందిగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్లు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిందిస్థాయి కార్యకర్తల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు. రాష్ట్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన శర్మిళను మహిళ అని కూడా చూడకుండా కారుతో సహా అరెస్ట్ చేసిన పోలీసుల అత్యుత్సాహం చూస్తే కేసీఆర్ హయాంలో ఇక్కడి స్వేచ్ఛకున్న హద్దులు బహిర్గత మవుతున్నాయి. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఈ సంఘ టన బహిర్గతం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోయారు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు కరెంట్ మీటర్లు కేంద్రం పెట్టబోతోందనీ, అలాగే కేంద్రం రాష్ట్రానికి ‘నయా పైసా’ ఇవ్వలేదనీ రోజూ దుష్ప్రచారం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎంలు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇప్పటికి మూడుసార్లకు పైగా ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఆహ్వా నించకుండా ముఖం చాటేశారు. మునుగోడు ఎన్నికలలో దశాబ్దాలుగా కాంట్రాక్టులు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటూ దుష్ట ప్రచారానికి తెరలేపారు. మరి మిషన్ భగీరథ, కాకతీయ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది ఎవరు? అందులో కమిషన్ ఎంత ముట్టిందని మాత్రం వీళ్ళను ప్రశ్నించడం ‘సమాఖ్య వ్యవస్థ’పై దాడి అవుతుంది కాబోలు! రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ‘గాడిపసరం’లా కట్టేసి ఇలా ఏ ముఖ్యమంత్రీ వాడలేదు. కానీ రోజూ ‘ఈడీ, సీబీఐ దాడులు’ అని గింజు కుంటారు! ఈ రాష్ట్రంలో ‘జన్మకో శివరాత్రి’లా జరిగే ముఖ్యమంత్రి పర్యటన నాడు ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను ‘హౌస్ అరెస్టు’లు చేస్తున్నారు. ఏ సభ, పాదయాత్ర జరుపు కోవాలన్నా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన దుఃస్థితి నెలకొన్న కేసీఆర్ పాలన కేసీఆర్ చేరదీసిన మేధా (తా)వులకు స్వర్గంలా ఉందట. ధర్నా చౌక్ కూడా లేకుండా చేసి, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను గొప్ప ప్రజా స్వామ్య వాదిగా వీరు కీర్తిస్తున్నారు. అయితే వేయి శవాలను తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు. కాలం ప్రతి దానికీ సమాధానం చెబుతుంది. చరిత్రలో కూలి పోయిన ఎందరో నియంతలు ఇందుకు ఉదాహరణ. (క్లిక్ చేయండి: ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?) - డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు -
బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్‌లాల్ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
బీజేపీ ఎంబీసీ కోకన్వీనర్‌గా సూర్యపల్లి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎంబీసీ సెల్ కోకన్వీనర్‌గా సూర్యపల్లి శ్రీనివాస్‌ను నియమించినట్టు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు పార్టీలో ప్రాతినిథ్యం కల్పించేందుకు ఎంబీసీ సెల్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ బలోపేతానికి పాటు పడాలని శ్రీనివాస్‌కు ఈ సందర్భంగా భాస్కర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీజేపీ బలోపేతానికి కృషి అత్యంత వెనుకబడిన కులాలను భాగస్వాములను చేసి బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సూర్యపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఆలె భాస్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
లక్ష్మణ్‌కు అమిత్‌షా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్‌కు హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది.. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నుంచి ఇద్దరికి పార్టీలో కీలక పదవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. -
చేతి వృత్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: లక్ష్మణ్
► గీత కార్మికులను ఆదుకునే చర్యలేవి?: దత్తాత్రేయ ► ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేతి వృత్తులకు, బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు హైదరాబాద్‌లో శనివారం జరిగింది. సదస్సులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి, మార్పు వస్తుందని ఆశించినా మూడేళ్లలో పరిస్థితి మరింత క్షీణించి పోయిందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ సబ్‌ప్లాన్ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో 17 ఫెడరేషన్లు ఉంటే, వాటిని 11కు కుదించారని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటికి చైర్మన్లను నామినేట్ చేసినా, వారికి కార్యాలయాలు, కుర్చీలు, నిధుల్లేవని ఆరోపించారు. కల్తీ కల్లు పేరుతో చీప్ లిక్కర్ లాబీకి తలొగ్గి గీత కార్మికులకు అన్యాయం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో అనేక ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లను నేలమట్టం చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ప్రతి గ్రామంలో తాటిచెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. తాటిచెట్లు ఎక్కేవారికి ఆధునిక యంత్రాలు ఇవ్వాలని, కల్లుగీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని, సమగ్రచట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతకార్మికుల బతుకులు మారుతాయని వారు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని బండారు దత్తాత్రేయ అన్నారు. వారిని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలనూ తీసుకోవట్లేదన్నారు. నీరా పరిశ్రమ అభివృద్ధికి యువతకు రూ.5 నుంచి రూ.10 కోట్ల దాకా కేంద్రం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సదస్సుకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.నర్సింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు భరత్‌గౌడ్ పాల్గొన్నారు.