
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (చదవండి : కరోనాతో ఎంపీ వసంతకుమార్ కన్నుమూత )
Comments
Please login to add a commentAdd a comment