
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,415 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 11 ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 799 కు చేరింది. తాజాగా 1580 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 87,675. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28941. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.33 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.6 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment