
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులో కొద్దిగా తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 40 శాతం ఇతరరాష్ట్రాల వారికి వైద్యం అందుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఉన్నాయని చెప్పారు. బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment