
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1983 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594 కు చేరింది. వైరస్ బాధితుల్లో మరో 10 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1181 కి చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 2381 మంది కోలుకోవడంతో.. రికవరీ కేసుల మొత్తం సంఖ్య 1,74,769 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26,644 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డి జిల్లాలో 187 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక కరోనా మరణాల రేటు దేశంలో 1.6 శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. బాధితుల రికవరీ రేటు భారత్‌లో 84.7 శాతం ఉండగా.. తెలంగాణ 86.26 శాతంగా
ఉందని వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 50,598 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 32,92,195 నమూనాలు పరీక్షించామని పేర్కొంది.
(చదవండి: కరోనా : ఆ ఐదు రాష్ర్టాల్లో అధికం)
Comments
Please login to add a commentAdd a comment