సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2278 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 2458 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,005. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.75 శాతం ఉండగా.. తెలంగాణలో 78.7 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు భారత్‌లో 1.66 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.61 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 62,234 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు మొత్తం 20,78,695 పరీక్షలు చేశామని తెలిపింది.
(చదవండి: టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘బిస్కెట్’ )
Comments
Please login to add a commentAdd a comment