
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనాబారిన పడుతున్నవారి సంఖ్య తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1171 కు చేరింది. అయితే, కోవిడ్ బాధితుల రికవరీ రేటు తెలంగాణలో 85.93 శాతానికి పెరగడం శుభ పరిణామం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2176 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,72,388. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 27,052. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉండగా తెలంగాణలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,348 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 32,41,597 కు చేరిందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment