
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,096 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,24,528 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(చదవండి: మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త..!)
Comments
Please login to add a commentAdd a comment