
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 43,916 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 7 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1256 కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1,435 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,94,653 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 37,46,963 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. కరోనా రోగుల రికవరీ రేటు భారత్‌లో 87.5 శాతం ఉండగా.. రాష్ట్రంలో 88.79 శాతంగా ఉందని తెలిపింది. అదే సమయంలో దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా.. తెలంగాణలో 0.57 శాతం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment