
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 836 కు చేరింది. సోమవారం ఒక్కరోజే 2325 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,162.
తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,699. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.94 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.77 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.65 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 58,264 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 14,23,846 నమూనాలు పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది.
(చదవండి: దారుణం: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి)
Comments
Please login to add a commentAdd a comment