కరుణాయముడు యేసు | Jesus merciful | Sakshi
Sakshi News home page

కరుణాయముడు యేసు

Published Sat, Apr 15 2017 9:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

కరుణాయముడు యేసు

కరుణాయముడు యేసు

 జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
 
 కర్నూలు (టౌన్‌): కరుణామయుడు యేసు ప్రభువని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఈస్టర్‌ పండగ పురస్కరించుకొని స్థానిక స్టాంటన్‌ చర్చి ఆవరణలో రన్‌ఫర్‌ జీసస్‌ పేరుతో నిర్వహిస్తున్న రన్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా గాలిలోకి పావురాలను, బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శత్రువులను సైతం ప్రేమించాలన్న క్రీస్తు మాటాలను క్త్రెస్తవులు ఆచరించడం అభినందనీయమన్నారు.
 
మైనార్టీ వేల్ఫేర్‌  అధికారి మస్తాన్‌ వలీ మాట్లాడుతూ..  236 దేశాల్లో 750 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే క్త్రెస్తవులు అత్యధికంగా ఉన్నారన్నారు. సిలువ వేసి మరణానికి కారుకులైన వారిని సైతం క్షమించమని దేవున్ని వేడుకున్న క్రీస్తు క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడే  ప్రపంచశాంతి ప్రజ్వరిల్లుతుందన్నారు. రన్‌ ఫర్‌ జీసస్‌లో కర్నూలు  క్త్రెస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్‌ స్థానిక స్టాంటన్‌ చర్చి నుంచి ్రప్రారంభమై కలెక్టరేట్‌ మీదుగా సి. క్యాంపు ప్రార్థన మందిరం వరకు సాగింది. పాస్టర్ల ప్రార్థనలతో రన్‌ను ముగించారు.  పాస్టర్లు రెవరెండ్‌ సజీవన్, జాన్సన్, విక్టర్‌ ఇమ్మానియేలు, కార్యనిర్వహణ కార్యదర్శి డి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement