సీపీఎస్‌పై అశోక్‌బాబు వ్యాఖ్యలు సరికాదు
చిలకడపూడి :
ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటంపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, శోభన్‌బాబులు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు నష్టపోతున్నారని దీనిపై సెప్టెంబరు 1వ తేదీన విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. దీనికి మద్దతు పలకాలని ఉద్యోగులు సమాయత్తం అవుతుంటే అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. శాంతి ర్యాలీ, మహాసభకు ఎన్జీవో నాయకులు సహకరించాలని వారు కోరారు.