సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు.
న్యాయమైన తమ డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఏపీ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ‘సీపీఎస్ కోసం అమరావతిలో నిరసన వ్యక్తం చేసిన టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Strongly condemn the arrest of teachers protesting for the abolition of CPS in Amaravati.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2018
అంతకు ముందు ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment