
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
కమిటీ వేశామని.. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. దానిపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని చెప్పారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు.
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్ స్టాఫ్ కమిటీ సభ్యులతో సమావేశం జరగనుంది. 16 ఉద్యోగ సంఘాలను సంప్రదింపులకు ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment