సదస్సులో మాట్లాడుతున్న సిటు అధ్యక్షులు శ్రీనివాస్
కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో ఆదివారం యుౖనైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
శ్రీకాకుళం సిటీ : కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో ఆదివారం యుౖనైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిదర్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. యుఎంహెచ్‌ఈయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.లక్ష్మి, పి.అప్పారావులు మాట్లాడుతూ అనేక సంవత్సరాల దేశవ్యాప్త పోరాటాల వల్ల పాతపెన్షన్ విధానాన్ని దక్కించుకున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి వైద్య శాఖ ఉద్యోగులు అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కిశోర్, యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.