►ఆపిల్ పై తొక్క తీసి, ముక్కలు కోసి, మిక్సర్‌లో వేసి గుజ్జు చేయాలి. దీంట్లో రెండు టీ స్పూన్ల తేనె, విటమిన్–ఇ క్యాప్సుల్ మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
►సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు చేయాలి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ ముడతలను నివారిస్తుంది.
►సగం ముక్క ఆపిల్‌ను తరగాలి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలిపి మెత్తగా నూరి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా వేళ్లతో రాయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొబ్బరిపాలు లేదంటే మజ్జిగ కలుపుకోవచ్చు. ఈ ప్యాక్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
ఆపిల్ ప్యాక్
Published Thu, Dec 12 2019 12:06 AM | Last Updated on Thu, Dec 12 2019 12:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment