ప్రాపర్టీలకు అడ్డా హనీగ్రూప్‌! | Honegroup for properties | Sakshi
Sakshi News home page

ప్రాపర్టీలకు అడ్డా హనీగ్రూప్‌!

Published Sat, Nov 24 2018 1:38 AM | Last Updated on Sat, Nov 24 2018 1:38 AM

Honegroup for properties - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపార్ట్‌మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్‌! హనీగ్రూప్‌లో లాగిన్‌ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల ప్రాపర్టీలు దొరికిపోతాయి. అంతేకాదండోయ్‌.. సైట్‌ విజిట్‌ నుంచి మొదలుపెడితే లీగల్, వేల్యువేషన్, రిజిస్ట్రేషన్, బ్యాంక్‌ లోన్స్‌ అన్ని రకాల సేవల నిర్వహణ బాధ్యత కూడా హనీగ్రూప్‌దే. మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎం. ఓబుల్‌ రెడ్డి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

3 రాష్ట్రాలు; 6 బ్రాంచీలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) గుర్తింపు పొందిన కంపెనీ హనీగ్రూప్‌. ఫ్లాట్లను, ప్లాట్లను ప్రొఫెషనల్‌గా విక్రయించడం మా పని. ప్రస్తుతం విశాఖపట్నం, కూకట్‌పల్లి, ఉప్పల్, గాజువాక, శ్రీకాకుళం, బెంగళూరుల్లో బ్రాంచీలున్నాయి. వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, సికింద్రాబాద్, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు సౌత్, ఈస్ట్, సెంట్రల్‌ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలను ప్రారంభించనున్నాం.

230 మంది డెవలపర్లు; 360 ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం పూర్వాంకర, ప్రెస్టిజ్, ఎల్‌అండ్‌టీ, బిగ్రేడ్, లెగసీ, ప్రావిడెంట్, సెంచురీ, గోద్రెజ్‌ వంటి 230 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వీటిల్లో సుమారు 360 ప్రాజెక్టŠస్‌ ఉంటాయి. లక్ష చ..అ. ఫ్లాట్స్, 10 వేల వరకు ఓపెన్‌ ప్లాట్లుంటాయి. హైదరాబాద్‌లో సుమారు 50 మంది డెవలపర్లు, 120 ప్రాజక్ట్స్‌ ఉంటాయి. హనీగ్రూప్‌తో డెవలపర్లకు లాభమేంటంటే? త్వరగా ఫ్లాట్లను విక్రయించి పెడుతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు ఆదాయం త్వరగా వస్తుంది. కొనుగోలుదారులకు ఏం లాభమంటే?  హనీ గ్రూప్‌లో ఏజెంట్లుండరు. అందరూ కంపెనీ సొంత ఉద్యోగులే. దీంతో ధర తగ్గుతుంది.

ఏడాదిలో వెయ్యి మంది ఉద్యోగులు..
విశాఖపట్నం కేంద్రంగా 9 మంది ఉద్యోగులతో ప్రారంభమైన హనీగ్రూప్‌లో ప్రస్తుతం 304 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నాటికి 1,000 మంది ఉద్యోగులను చేర్చాలన్నది లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు నిర్మాణ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తే.. హనీగ్రూప్‌లో మాత్రం 5 బ్రాంచీల్లో కలిపి 240 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. హనీగ్రూప్‌లో సుమారు 2 వేల మంది కస్టమర్లున్నారు. 95 శాతం కస్టమర్లు తొలిసారి గృహ కొనుగోలుదారులే.

ఇంటీరియర్‌ ప్లాంట్‌..
ప్రస్తుతం అచ్యుతాపురంలో సొంతంగా రెండు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. 800 గజాల్లోని శ్రీనివాసం ప్రాజెక్ట్‌లో 15 ఫ్లాట్లుంటాయి. 4 వేల గజాల్లోని మరో ప్రాజెక్ట్‌లో 80 ఫ్లాట్లుంటాయి. గతేడాది హనీగ్రూప్‌ రూ.3.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఈ ఏడాది రూ.5 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇటీవలే యాపిల్‌ పేరిట ఇంటీరియర్‌ కంపెనీని ప్రారంభించా. విశాఖపట్నంలోని గంభీరంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం. 1,200 గజాల్లోని ఈ ప్లాంట్‌లో వార్డ్‌ రోబ్స్, మాడ్యులర్‌ కిచెన్స్, టీవీ యూనిట్స్‌ వంటి ఇంటీరియర్‌ను తయారు చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement