obul reddy
-
పుష్పగిరిలో కాకతీయులనాటి ఆలయం
మైదుకూరు/కడప కల్చరల్: పుష్పగిరి క్షేత్రంలో 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఆలయం వెలుగు చూసింది. వైఎస్సార్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరున్న పుష్పగిరిలో వందల ఆలయాలు ఉన్నాయి. కానీ అక్కడ పుష్పాచలేశ్వర ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు. కొండపై ఈశాన్యంలో ఈ ఆలయాన్ని కాకతీయ వాస్తు నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడంతో ఆలయం నేడు శిథిలావస్థకు చేరింది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ప్రస్తుతం తలపెట్టిన గిరి ప్రదక్షిణకు మరింత విశిష్టత చేకూరుతుందని రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్‌రెడ్డి తెలిపారు. -
ప్రాపర్టీలకు అడ్డా హనీగ్రూప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార్ట్మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్! హనీగ్రూప్‌లో లాగిన్ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల ప్రాపర్టీలు దొరికిపోతాయి. అంతేకాదండోయ్.. సైట్ విజిట్ నుంచి మొదలుపెడితే లీగల్, వేల్యువేషన్, రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్స్ అన్ని రకాల సేవల నిర్వహణ బాధ్యత కూడా హనీగ్రూప్దే. మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎం. ఓబుల్ రెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 3 రాష్ట్రాలు; 6 బ్రాంచీలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) గుర్తింపు పొందిన కంపెనీ హనీగ్రూప్. ఫ్లాట్లను, ప్లాట్లను ప్రొఫెషనల్‌గా విక్రయించడం మా పని. ప్రస్తుతం విశాఖపట్నం, కూకట్పల్లి, ఉప్పల్, గాజువాక, శ్రీకాకుళం, బెంగళూరుల్లో బ్రాంచీలున్నాయి. వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, సికింద్రాబాద్, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు సౌత్, ఈస్ట్, సెంట్రల్ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలను ప్రారంభించనున్నాం. 230 మంది డెవలపర్లు; 360 ప్రాజెక్ట్‌లు.. ప్రస్తుతం పూర్వాంకర, ప్రెస్టిజ్, ఎల్అండ్టీ, బిగ్రేడ్, లెగసీ, ప్రావిడెంట్, సెంచురీ, గోద్రెజ్ వంటి 230 నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వీటిల్లో సుమారు 360 ప్రాజెక్టŠస్ ఉంటాయి. లక్ష చ..అ. ఫ్లాట్స్, 10 వేల వరకు ఓపెన్ ప్లాట్లుంటాయి. హైదరాబాద్‌లో సుమారు 50 మంది డెవలపర్లు, 120 ప్రాజక్ట్స్ ఉంటాయి. హనీగ్రూప్తో డెవలపర్లకు లాభమేంటంటే? త్వరగా ఫ్లాట్లను విక్రయించి పెడుతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు ఆదాయం త్వరగా వస్తుంది. కొనుగోలుదారులకు ఏం లాభమంటే? హనీ గ్రూప్‌లో ఏజెంట్లుండరు. అందరూ కంపెనీ సొంత ఉద్యోగులే. దీంతో ధర తగ్గుతుంది. ఏడాదిలో వెయ్యి మంది ఉద్యోగులు.. విశాఖపట్నం కేంద్రంగా 9 మంది ఉద్యోగులతో ప్రారంభమైన హనీగ్రూప్‌లో ప్రస్తుతం 304 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నాటికి 1,000 మంది ఉద్యోగులను చేర్చాలన్నది లక్ష్యం. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు నిర్మాణ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తే.. హనీగ్రూప్‌లో మాత్రం 5 బ్రాంచీల్లో కలిపి 240 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. హనీగ్రూప్‌లో సుమారు 2 వేల మంది కస్టమర్లున్నారు. 95 శాతం కస్టమర్లు తొలిసారి గృహ కొనుగోలుదారులే. ఇంటీరియర్ ప్లాంట్.. ప్రస్తుతం అచ్యుతాపురంలో సొంతంగా రెండు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. 800 గజాల్లోని శ్రీనివాసం ప్రాజెక్ట్‌లో 15 ఫ్లాట్లుంటాయి. 4 వేల గజాల్లోని మరో ప్రాజెక్ట్‌లో 80 ఫ్లాట్లుంటాయి. గతేడాది హనీగ్రూప్ రూ.3.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఈ ఏడాది రూ.5 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇటీవలే యాపిల్ పేరిట ఇంటీరియర్ కంపెనీని ప్రారంభించా. విశాఖపట్నంలోని గంభీరంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం. 1,200 గజాల్లోని ఈ ప్లాంట్‌లో వార్డ్ రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, టీవీ యూనిట్స్ వంటి ఇంటీరియర్‌ను తయారు చేస్తాం. -
ఇవ్వాళ శుక్రవారం!
అజయ్ మొహంలో ఎక్కడా భయం కనబడటం లేదు. ప్రశాంతంగా కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్. కొద్దిసేపంతా నిశ్శబ్దం. ‘‘అమ్మో అరేయ్! ఆ ఓబులురెడ్డి మామూలు మనిషి కాదు’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోని ఒకతనన్నాడు. ‘‘ఓబుల్‌రెడ్డి అంటే.. కొంపదీసి శివారెడ్డి తమ్ముడు కాదు కదా!’’ ఇంకొకతను.‘‘శివారెడ్డా? ఆడెవడు?’’ అజయ్ మాటల్లో ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది.‘‘మీ నాన్నకు మొగుడు. హోమ్ మినిష్టర్. ఈ స్టేట్ మొత్తం ఆడి గుప్పిట్లో ఉంది. వాళ్ల నుండి తప్పించుకోవడం ఇంపాజిబుల్ రా..’’ ఫ్రెండ్ భయపెడుతూ చెప్పాడు. ‘‘సర్లే! నువ్వెలాగూ ఆ అమ్మాయిని పంపించేశావు కదా.. కొన్నాళ్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది..’’ కొనసాగించాడు ఆ ఫ్రెండ్. అజయ్ ఆలోచనల్లో పడ్డాడు. చాలాసేపటికి నోరువిప్పాడు – ‘‘ఏంటి పంపించేది? పాస్‌పోర్ట్, వీసా దొరకాలి కదా..’’ ‘‘అంటే.. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే..’’ ఫ్రెండ్ భయపడుతూ కూర్చున్నచోటునే నిలబడి అజయ్‌ని చూస్తూ, సగం మాటే పలికాడు.‘‘మా ఇంట్లోనే.. నా రూమ్ వార్డ్‌రోబ్‌లో ఉంది.’’ అన్నాడు అజయ్. ఫ్రెండ్స్ షాక్‌తో అజయ్‌ను చూస్తూండిపోయారు. పోలీసులు అప్పటికే అమ్మాయిని వెతికే పనిలో పడిపోయారు. హోమ్ మినిష్టర్ తమ్ముడు ఓబుల్‌రెడ్డి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసేవరకూ స్నానం కూడా చేయనని బురద అంటిన బట్టలనే కట్టుకొని ఉన్నాడు. ఓబుల్‌రెడ్డికి ఆ అమ్మాయంటే పిచ్చి ప్రేమ. అతనొక పేరుమోసిన ఫ్యాక్షనిస్ట్. ఆ అమ్మాయి కోసమే రెండు హత్యలు చేసినవాడు. అలాంటి ఓబుల్‌రెడ్డిని పట్టపగలు నడిరోడ్డు మీద, అదీ కొండారెడ్డి బురుజు దగ్గర ఒక్కదెబ్బతో నేలకొరిగేలా చేశాడు అజయ్. అజయ్ వెనకాలే వెళ్లి నిల్చుంది ఆ అమ్మాయి. పేరు స్వప్న. ఓబుల్‌రెడ్డి ఆమెకు వరుస అవుతాడు. మనసు పడ్డాడు. కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదు. పారిపోవాలి. అమెరికాలో ఉన్న చుట్టాల దగ్గరకు పారిపోవాలి. ఈ ఊరు, ఓబుల్‌రెడ్డి.. అన్నీ దాటుకొని పారిపోవాలి. అజయ్ వెనకాలే నిల్చున్న ఆమెకు అతనొక్కడే ఇప్పుడు ధైర్యం. ఆ ఒక్కడే ఆమెను ఊరు దాటించాలి. అజయ్ ఇల్లు. వార్డ్‌రోబ్‌లో స్వప్న లేదు. అజయ్‌కి భయం పెరిగిపోయింది. పోలీసులకు విషయం తెలిసి ఆమెను తీసుకెళ్లిపోయారా? రూమంతా వెతికాడు. ఇల్లంతా వెతికాడు. పక్కన సందులో, ఇంటి వెనుక.. అంతటా వెతికాడు. స్వప్న చివరికి కనిపించింది.. అజయ్ రూమ్‌లోనే, చిన్న చిన్న బొమ్మల మధ్య బొమ్మలాగా. ఊపిరి పీల్చుకున్నాడు. స్వప్నకి అజయ్ ఇప్పుడొక నమ్మకం. ఆమెను దేశం దాటించగల ఒక్కడు అజయే! అజయ్ స్వప్నకు పాస్‌పోర్ట్ సంపాదించేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. అదేమీ చిన్న విషయం కాదు. అదీ స్వప్నను బయటకు తీసుకెళ్లలేని ఈ పరిస్థితుల్లో! స్వప్నకి ఇల్లు గుర్తొచ్చింది. చుట్టూ అజయ్, అతని ఫ్రెండ్స్, అతని చెల్లి ఉన్నా కూడా స్వప్న ఒంటరిగా ఫీలయింది. ఏడ్వడం మొదలుపెట్టింది. అజయ్ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని, ‘‘ఇవ్వాళ ఏం వారం?’’ అనడిగాడు. మళ్లీ వెంటనే, చిన్నగా నవ్వి, ‘‘వారాలు, తేదీలు నీకేం గుర్తుంటాయ్! ఇవ్వాళ శుక్రవారం. ఫ్రైడే. సో, ఇవ్వాళ నువ్వు ఏడ్వకూడదు. కావాలంటే రేపు ఏడువు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావ్..’’ అన్నాడు. స్వప్న చిన్నగా నవ్వింది. ఆరోజు నుంచీ ఆమెను కాపాడుకోవడంతో పాటు నవ్వించడమూ అజయ్‌తో పాటు అతని ఫ్రెండ్స్ అందరికీ ఒక పని. రోజులు గడుస్తున్నాయి. స్వప్న అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమెను పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదని ఓబుల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు. స్వప్న ఎక్కడుందో వాళ్లకు తెలిసిపోయింది. కానీ అప్పటికే స్వప్నను మరో సేఫ్ ప్లేస్‌కి మార్చాడు అజయ్. ఇప్పుడు ఆ సేఫ్ ప్లేస్లోనుంచి స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాలి. ‘‘ఓ పక్క పోలీసులు.. మరోపక్క ఓబుల్‌రెడ్డి మనుషులు.. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు కాదు, ముందసలు ఇక్కణ్నుంచి తీసుకెళ్లడమే కష్టం..’’ అజయ్ ఫ్రెండ్ గ్యాంగ్‌లోని ఒకతను మొత్తం సిట్యుయేషన్ చెప్పాడు. అజయ్ కాసేపు ఆలోచించి ఒక ప్లాన్ గీశాడు. ఫ్రెండ్స్‌కి ఆ ప్లాన్ చెప్తూ – ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి ఇక్కణ్నుంచి బయల్దేరాలి!’’ అన్నాడు. స్వప్నకు మాత్రం తన ప్రపంచం ఇదేనని తెలుస్తోంది. ఆమెకు అజయ్‌ని, ఈ ప్రపంచాన్నీ వదిలిపోవాలని లేదు.‘‘నే వెళ్లిపోతున్నా కదా! బాధగా లేదా?’’ అడిగింది స్వప్న, అజయ్ అన్ని ఏర్పాట్లూ చేస్తూండడం చూసి. ‘‘బాధేముంది?సంతోషించాల్సిన విషయమేగా!’’ ‘‘నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్‌ని విడిచిపెట్టాలంటే నావల్ల కావడం లేదు.’’ ‘‘అలా అయితే నాక్కూడా బాధగానే ఉంది. నువ్వెళ్లిపోతున్నావ్ కదా.. ఈ ఛేజ్‌లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఇవేవీ ఉండవు. అయినా ఇప్పుడింత టెన్షన్లో ఈ కబుర్లు అవసరమా?’’ అంటూ స్వప్న బ్యాగ్ సర్దినిల్చున్నాడు అజయ్. అజయ్ ప్లాన్‌ను ఫ్రెండ్స్ సరిగ్గా అమలుపరిచారు. స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చాడు అజయ్. ఇంకాసేపట్లో ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. స్వప్న తన అమ్మా, నాన్నలను కూడా కలిసేలా ప్లాన్ చేశాడు అజయ్. స్వప్నకు జాగ్రత్తలన్నీ చెప్పి, బై చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నాడు అజయ్. బండి స్టార్ట్ చేస్తున్నాడు. గట్టిగా కిక్ కొడుతూ బండి స్టార్ట్ చేస్తూ అన్నాడు – ‘‘స్వప్న.. రా కూర్చో!’’. అజయ్ వెనక్కి తిరిగి స్వప్నను చూశాడు. దూరం నుంచి స్వప్న అజయ్‌నే చూస్తూంది. -
నా భర్త నాకు కావాలి
కందుల కుటుంబం నన్ను బెదిరిస్తోంది ప్రేమ వివాహం చేసుకుని పొమ్మంటున్నారు బాధితురాలు వాసంతిరెడ్డి కడప వైఎస్ఆర్ సర్కిల్: కందుల ఓబుల్‌రెడ్డి(నాని) తనను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. గురువారం వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2013–15లో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో నాని, తను ప్రేమించుకున్నామని, 2015 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తనను వాళ్లింటికి తీసుకుపొమ్మని ఓబుల్‌రెడ్డిని అడిగినట్లు చెప్పారు. అతను తనను తీసుకువెళ్లకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలల నుంచి పెద్ద మనుషులను వాళ్ల ఇంటికి పంపితే ఏ సమాధానం చెప్పడం లేదని తెలిపారు. తన తల్లిని.. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, మీ ముఖాన పడేస్తాం అంటూ అవమానించారన్నారు. ‘మా దగ్గర డబ్బు ఉంది, నిన్ను ఏమైనా చేస్తాం, మీ ఆడవాళ్లు నన్నేం చేస్తారు, మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి’ అంటూ ఓబుల్‌రెడ్డి, అతని స్నేహితులు బెదిరిస్తూ, సెల్ మెసేజ్‌లతో వేధిస్తున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రేమించానంటూ కళాశాలలోనే వెంటపడేవారన్నారు. ఈ విషయం కళాశాలలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. బుధవారం తన భర్తను చూపించాలంటూ పెట్రోల్ బాటిల్‌తో నాని ఇంటి దగ్గరకు వెళ్లితే వారు పోలీసులను పిలిపించారన్నారు. పోలీసులు తనను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. వారిపై ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8.45 వరకు ఉంచి, తర్వాత ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ మహిళా పోలీస్ స్టేషన్‌కు పొమ్మన్నారని కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తతోనే జీవితం కావాలని, అతను తనకు దక్కేవరకు పోరాడతానన్నారు. సమావేశంలో ఐద్వా మహిళా సంఘం కమిటీ సభ్యులు తస్లీమ్, నగర అధ్యక్షురాలు జమీలా, సహాయక కార్యదర్శి లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: బీజేపీ నాయకుడు కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కడప వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాసవీ రెడ్డి గతంలో శివానందరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినట్టు తెలుస్తోంది. తనకు శివానందరెడ్డి ఆస్తులు ఏమీ వద్దని, ఓబుల్ రెడ్డి భార్యగా గుర్తింపు కావాలని బాధితురాలు పేర్కొంది. తాను ఎంటెక్ చదివానని, తన కాళ్లపై తాను నిలబడగలనని తెలిపింది. భర్తతో కలిసుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓబుల్ రెడ్డి, వాసవీ రెడ్డి మధ్య అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పరిగిలో కాల్పుల కలకలం
-
పరిగిలో కాల్పుల కలకలం
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిగిలో కాల్పులు కలకలం సృష్టించింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైపై దుండగులు కాల్పులకు యత్నించారు. అయితే ఈ కాల్పుల నుంచి ఎస్సై ఓబుల్‌రెడ్డి తప్పించుకుని... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అ క్రమంలో ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దుండగుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పరిగిలో శుక్రవారం రాత్రి ఎస్సై ఓబుల్‌రెడ్డి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో స్థానిక ఎస్బీహెచ్ సమీపంలోని గంజిరోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్సై గుర్తించారు. వారిని ప్రశ్నించేందుకు ఎస్సై సన్నద్దమవుతున్న తరుణంలో వారు కారులో పరారయ్యారు. వెంటనే ఎస్సై వారిని వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారైయ్యారు. ఈ క్రమంలోనే ఎస్సైపై దాడికి యత్నించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ పరిగిపోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి తుపాకీలతోపాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బ్యాంకు చోరీకి వచ్చారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆటో, మోటారుసైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి సబ్‌మార్కెట్ యార్డు వద్ద గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కె.ఆనంద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు..
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భార్యా భర్తలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా రాజుపాలెంకు చెందిన భార్యాభర్తలు ఓబుల్ రెడ్డి(35) హుస్సేనమ్మ(32) తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి బైక్ వెళ్తున్నారు. ఈ క్రమంలో నందవరం పండ్లాపురం గ్రామల మధ్యకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. దీంతో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తిపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
వీరపునాయునిపల్లె (వైఎస్సార్ జిల్లా): భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు.. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని గోనుమాకులపల్లెకు చెందిన పాల కొండయ్యకు, ఓబుల్‌రెడ్డి పల్లె గ్రామానికి చెందిన లక్ష్మయ్య, నారప్ప, శంకర్లకు భూమి విషయమై గొడవలున్నాయి. ఈ వివాదం కోర్టులో ఉంది. బుధవారం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కొండయ్య తన ద్విచక్రవాహనంపై ఉదయం బయలుదేరి వెళ్తుండగా దారిలో కాపుకాచిన ముగ్గురు ప్రత్యర్థులు అతని మెడను కత్తితో కోసి, చనిపోయాడనుకుని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన వారు అతడిని కడప రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.