
మైదుకూరు/కడప కల్చరల్: పుష్పగిరి క్షేత్రంలో 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఆలయం వెలుగు చూసింది. వైఎస్సార్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరున్న పుష్పగిరిలో వందల ఆలయాలు ఉన్నాయి. కానీ అక్కడ పుష్పాచలేశ్వర ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు.
కొండపై ఈశాన్యంలో ఈ ఆలయాన్ని కాకతీయ వాస్తు నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడంతో ఆలయం నేడు శిథిలావస్థకు చేరింది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ప్రస్తుతం తలపెట్టిన గిరి ప్రదక్షిణకు మరింత విశిష్టత చేకూరుతుందని రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్‌రెడ్డి తెలిపారు.