లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం కోమనూతల గ్రామంలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు 2 కిలోల వెండి గొడుగులు, ఆభరణాలను అపహరించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత గర్భగుడి ఆలయం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు ఆభరణాలు ఉంచిన బీరువాను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు దొంగతనం జరిగినట్టు గుర్తించి కమిటీ కి సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.